English   

పవన్ క్రిష్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి

Pawan kalyan
2020-02-13 11:02:35

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తరువాత తిరిగి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన కమ్ బ్యాక్ ఫిలిం, పింక్ రీమేక్ షూటింగ్ ఇటీవలే మొదలు పెట్టారు. ఆ సినిమా షూట్ కూడా ఇప్పటికే పూర్హయింది కూడా. ఆ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా కూడా చేస్తున్నారు. ఆ సినిమా పది రోజుల క్రితం అల్యూమినియం ఫ్యాక్టరీ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించింది. అయితే నిన్నటితో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయిందని సమాచారం. 

ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలుగా తియ్యని గెడ్డం పవన్ కళ్యాణ్ తీసేసి కొత్త లుక్ లో కనిపించాడు. ఇది ఇలా ఉండగా ఈ షెడ్యూల్ కోసం అల్యూమినియం ఫ్యాక్టరీ లో వాటర్ బ్యాక్ డ్రాప్ లో ఒక సెట్ వేశారట. ఆ సెట్ లో పవన్ కళ్యాణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలు షూట్ చేశారు. ఆ సెట్ లో స్టీం బోటులో పోరాట సన్నివేశాలు షూట్ చేసినటు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.  

More Related Stories