English   

అహం బ్రహ్మాస్మి అంటున్న మంచు వారబ్బాయి 

Manchu Manoj
2020-02-13 13:41:56

మోహన్ బాబు తనయుడిగా సినిమాల్లోకి అరంగేట్రం చేసిన మంచు మనోజ్ దొంగ దొంగది సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత రాజు భాయ్, బిందాస్, వేదం, కరెంట్ తీగ లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్నా ఒక్కడు మిగిలాడు అనే డిజాస్టర్ ఇచ్చి ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. వ్యక్తిగత కారణాలతో సతమతమైన మనోజ్ ఈ మధ్య తన వివాహ బంధానికి శుభ కార్డు వేసి మరీ మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి వచ్చేస్తున్నాడు. 

మనోజ్ మంచు ఆర్ట్స్ ప్రొడక్షన్ హౌజ్ పేరిట నిర్మాణ సంస్థ స్టార్ట్ చేసిన మనోజ్ ఆ ప్రొడక్షన్‌లో సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అహం బ్రహ్మాస్మి పేరుతో సినిమా చేస్తున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఈ సందర్భంగా ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు మనోజ్.    ”మూడేళ్ల తర్వాత మీ ముందుకు వస్తున్నాను. నేను దొంగ దొంగది సినిమాతో తెలుగులో మొదటి సినిమా చేసినప్పుడు ఎంత ఎమోషన్‌గా ఫీల్ అయ్యానో… ఇప్పుడు కూడా అదే ఎమోషన్ నాలో ఉంది. నా ప్రయాణంలో సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. నా జీవితమే సినిమా.. మూడేళ్లుగా చాలా మిస్ అయ్యాను… సినీ అమ్మా, వచ్చేశా… లవ్ యూ డార్లింగ్స్” అంటూ ట్వీట్ పెట్టారు.

More Related Stories