లూసిఫర్ రీమేక్ కి దర్శకుడు మారాడా...

ప్రస్తుతం చిరంజీవి టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఆయన ఒక పక్కన వరుసగ సినిమాలు ఒప్పుకుంటూ పోతుంటే ఒక వర్గం మీడియా ఏమో ఆయన ఏపీలో అధికార పార్టీ లో చేరతారని అలా చేరాక ఆయనకు రాజ్య సభ సీటు ఇచ్చి మళ్ళీ కేంద్ర మంత్రిని చేస్తారని ప్రచారం చేస్తోంది. ఆ సంగతి పక్కన పెడితే ఆయన కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుండగానే.. దాని తర్వాతి సినిమాకి ఆయన రంగం సిద్ధం చేసేసుకుంటున్నారు.
ఇప్పటికే చిరు కోసం రామ్‌చరణ్ ‘లూసిఫర్’ రీమేక్ హక్కులను కొన్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్‌ను క్రియేటీవ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించబోతున్నట్లు నిన్నమొన్నటి ప్రచారం జరిగింది. కానీ, తాజాగా ఈ రీమేక్‌కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త హల్చల్ చేస్తోంది. అదేంటంటే ఈ రీమేక్‌ను తెరకెక్కించే బాధ్యత సుక్కుకు కాక మరో దర్శకుడికి చరణ్ అప్పజెప్పినట్లు చెబుతున్నారు. ఆయనెవరో కాదు గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన దర్శకుడు బిజీ ఉండగా..కొరటాల శివ సినిమాతో చిరు తీరికలేకుండా ఉన్నారు.
ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయ్యాక పరశురామ్-చిరంజీవి కాంబినేషన్ సెట్స్‌పైకి వెళ్లనుందని ఫిలింనగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే చిరు సినిమాని పరశురామ్ డైరెక్ట్ చేస్తాడా..లేదా అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.