English   

ఇంతమంది హీరోయిన్లలో పవన్ సరసన ఎవరు..

pk
2020-02-14 07:14:18

పవన్ కళ్యాణ్-క్రిష్ సినిమాలో హీరోయిన్ ఎవరనే దానిపై రోజుకో కొత్త పేరు తెరపైకొస్తుంది. ఇప్పటి వరకు పూజా హెగ్డే.. ప్రగ్యా జైస్వాల్.. బాలీవుడ్ బ్యూటీలు సోనాక్షి సిన్హా, వాణీ కపూర్ ల పేర్లు జోరుగా వినిపించాయి. తాజాగా ఇప్పుడు శ్రీలంక బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్.. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ పేర్లు తెరపైకొచ్చాయి. దాంతో పవన్ సరసన నటించబోయే అసలు ముద్దుగుమ్మ ఎవరు..? అనే డైలమాలో ఉన్నారు అభిమానులు. ఎవరో ఒకరిని ఫైనలైజ్ చేయండ్రా బాబు అంటున్నారు.

అయితే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ.. వాళ్లను ఫైనలైజ్ చేయకపోవడానికి ఒక ముఖ్యమైన కారణం వినిపిస్తోంది. చాలామంది స్టార్ హీరోయిన్స్ రెమన్యురేషన్ లు భారీగా డిమాండ్ చేయడంతో ఫైనల్ గా ఇస్మార్ట్ బ్యూటీ నిధిఅగార్వల్ కే ఛాన్స్ దక్కనుందని వినిపిస్తోంది. ఈ అమ్మడి రెమ్యూనరేషన్ మిగతా బ్యూటీలతో పోల్చుకుంటే కాస్త తక్కువే.. అందుకే పవన్ సరసన నటించే బంపర్ ఆఫర్ ఈ అమ్మడికే ఖయమని వినిపిస్తోంది. ఇకపోతే.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పవన కళ్యాణ్ 27వ సినిమా కానుంది. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్నారు. టైటిల్ వచ్చేసి 'విరూపాక్ష' అని వినిపిస్తోంది. ఇక బడ్జెట్ వచ్చేసి 150 కోట్లకు మించి ఉండనుందని సమాచారం.

More Related Stories