శీనయ్య వద్దని చెప్పిన వినాయక్..

కొన్నాళ్లు మాస్ డైరెక్టర్ గా స్టార్ డమ్ అనుభవించిన వి.వి. వినాయక్.. ఆ తర్వాత డీలా పడ్డాడు. చిరంజీవితో చేసిన ఖైదీ నెం.150తో హిట్ అందుకున్నా.. చివరగా సాయి ధరమ్ తేజ్ తో చేసిన ఇంటిలెజెన్స్ మాత్రం వినాయక్ ను పూర్తిగా పక్కన పెట్టిసినంత పని చేసింది. దాంతో హీరోగా మారాలనుకున్నాడు.. కాదు కాదు దిల్ రాజు.. వినాయక్ కు గిఫ్ట్ గా హీరో చేద్దామనుకున్నాడు. కానీ ఏం లాభం ఈ శీనయ్య ఇప్పుడు అటకెక్కి కూర్చున్నాడని వినిపిస్తోంది.
నరసింహ దర్శకత్వంలో 'శీనయ్య' పేరుతో వినాయక్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మతగా కొబ్బరికాయ కొట్టుకున్న ఈ సినిమా.. గుమ్మడికాయ కొట్టే ఛాన్స్ ఇవ్వలేదని టాక్. ఈ సినిమా కోసం బొద్దుగా ఉన్న వినాయక్ చాలా కష్టపడి.. బరువు తగ్గి స్లిమ్‌గా మారిపోయిన ప్రయోజనం లేకపోయింది.
అసలు మ్యాటరేంటంటే.. ఇప్పటికే ఈ సినిమా తొలిషెడ్యూల్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అయితే ఆ రషెష్ చూసిన వినాయక్ కు పెద్దగా నచ్చలేదట. ఆ విషయాన్ని డైరెక్టర్‌కు చెప్పగా.. మరోసారి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడట. అయినా వినాయక్ కనెక్ట్ కాలేకపోయాడట. దాంతో దిల్‌రాజుకి శీనయ్యను ఆపేద్దామని.. లేకపోతే పెట్టిన పెట్టుబడి తిరిగి రాదని చెప్పాడట. ఈ బడా ప్రొడ్యూసర్ కూడా సరే అన్నట్టు సమాచారం. ఏదేమైనా దర్శకుడిగా గ్యాప్ తీసుకున్న వినాయక్ హీరోగా వద్దనుకున్నా.. మళ్లీ మెగా ఫోన్ పడితే బెటర్ అంటున్నారు.