English   

విజయ్ కోసం భారీ సెట్ ..

Vijay Deverakonda
2020-02-14 10:46:10

క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ఓ స్పోర్ట్స్ డ్రామా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. `ఇస్మార్ట్` తో హిట్ కొట్టి జోరు మీదున్న పూరీ జ‌గ‌న్నాథ్ రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో విజయ్ బాక్స‌ర్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌బోతున్నాడు విజ‌య్. ఇందులో బాక్సర్ గా నటించేందుకు కొన్ని రోజులు బాక్సర్ గా శిక్షణ కూడా తీసుకున్న విజయ్ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. 

ఈ ప్రమోషన్స్ ముగియగానే మళ్ళీ పూరీ సినిమా షూట్ లో పాల్గొననున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ స‌మ‌ర్ప‌ణ‌లో పూరి, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే నాయిక‌గా న‌టించ‌నుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ముందు జాన్వీ పేరు వినిపించినా తాజాగా ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. 

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ముంబైలో ఓ భారీ సెట్ ని తీర్చిదిద్దార‌ని తెలిసింది. దాదాపు 5 కోట్ల వ్య‌యంతో నిర్మించిన ఈ స్పెష‌ల్ సెట్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశార‌ట‌. ఈ సెట్ సినిమాకి ప్ర‌త్యేకాక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంద‌ని అంటున్నారు. కాగా, ఈ ఏడాది సమ్మర్ లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు పూరీ అండ్ కో ప్లాన్ చేస్తున్నారు. టైటిల్ అయితే ఇంకా కన్ఫాం చేయలేదు కానీ లైగర్ అనే పేరు పెడతారని మాత్రం ప్రచారం జరుగుతోంది. 

More Related Stories