English   

విజయ్ దేవరకొండ బోల్డ్ కామెంట్స్ 

 Vijay Devarakonda
2020-02-14 17:13:11

రౌడీ బాయ్స్ అంటూ విజయ్ దేవరకొండ చెప్పే మాటలు యూత్ కు ఫుల్ ఎనర్జీనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా క్యాజువల్ గా లోకల్ స్లాంగ్ లో మాట్లాడే విజయ్ మాటలంటే చాలామందికి ఇష్టం. అయితే ఒక్కోసారి విజయ్ ఫ్లోలో అలా అనేస్తాడో లేక ఇంకా అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ లోనే ఉన్నాడో తెలియదు గానీ.. విజయ్ చెప్పే మాటలు కొన్నిసార్లు వినే వాళ్లకు కొంచెం ఇబ్బందిని కల్గిస్తాయనే కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి. రీసెంట్ గా అలాంటి సెన్సేషనల్ బోల్డ్ కామెంట్ చేసి.. తనపై ట్రోల్స్ కు ఛాన్స్ ఇచ్చాడు.

క్రాంతి మాధవ్ దైరెక్షన్లో తెరకెక్కిన వరల్డ్ ఫేమస్ సినిమా ప్రేమికుల రోజున ఫిబ్రవరి 14న రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా విజయ్ ఓ ఇంటర్వ్యూలో తన సరసన ఓ హీరోయిన్ గా నటించిన రాశిఖన్నాపై బోల్డ్ కామెంట్స్ చేశాడు. సదరు యాంకర్ రాశిఖన్నాను.. మీకు డిఫరెంట్ గా ఎవరితోనైనా లవ్ లేదా డేటింగ్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారని అడిగింది. ఒకవేళ అలాంటి ఛాన్స్ వస్తే డాక్టర్ తో డేటింగ్ చేస్తానని చెప్పింది రాశిఖన్నా. 

దాంతో విజయ్ నువ్వు డాక్టర్ తో వెళితే.. వాళ్లు నిన్ను ఎక్కడ చూస్తారో తెలుసా..? చెక్కిళ్లు, కళ్లు కాకుండా.. నీ ఛాతి భాగాన్ని చూస్తారని కామెంట్ చేశాడు. దాంతో అవాక్కయిన రాశి.. వెంటనే తేరుకొని నువ్వు అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఒవర్ లో ఉన్నావని.. ఆ సినిమా చేసినప్పుడు ఆ పనే చేశావా.. అని నవ్వుతూ కవర్ చేసింది. అయితే విజయ్ మాటలు విన్ననెటిజన్లు అతనిపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. అప్పుడప్పుడు కాస్త వెనకముందు చూసుకొని మాట్లాడమని పోషల్ మీడియాలో చురకలు అంటిస్తున్నారు. మరి విజయ్ నెటిజన్ల కామెంట్ లకు ఎలా రియాక్ట అవుతాడో చూడాలి.

More Related Stories