English   

పెళ్లి ముచ్చట చెప్పిన రష్మిక మందన్న..

Rashmika Mandanna
2020-02-14 17:52:17

రష్మిక మందన్న పెళ్లి గురించి మరోసారి ఓపెన్ అయిపోయింది. సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ డిమాండ్ బాగానే పెరిగిపోయింది. ఈ సినిమా కమర్షియల్ విజయం సాధించడమే కాకుండా అందులో రష్మిక మందన్న క్యారెక్టర్ కూడా బాగానే పేలింది. దానికి తోడు డాన్స్ లో కూడా సత్తా చూపించింది రష్మిక. ప్రస్తుతం నితిన్ హీరోగా వస్తున్న భీష్మ సినిమాలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు చిత్ర యూనిట్. 

ఇదిలా ఉంటే ఇంటర్వ్యూలో భాగంగా పెళ్లి గురించి రష్మిక మందన్నను ఒక ప్రశ్న అడిగింది యాంకర్. దానికి వెంటనే సమాధానం కూడా ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతానికి సినిమాలు తప్ప పెళ్లి చేసుకునే ఆలోచన లేదని కన్ఫర్మ్ చేసింది. ప్రేమ వివాహం చేసుకుంటారా లేదంటే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా అని అడిగితే అలాంటిదేమీ లేదు.. తన ఓటు అరేంజ్డ్ మ్యారేజ్ కే అనేసింది. ప్రేమ పెళ్లిపై నమ్మకం లేదా అంటే నో కామెంట్స్ అనేసింది ఈ భామ. 

రెండేళ్ల కింద కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకుని రద్దు చేసుకుంది రష్మిక. ఆ తర్వాత పూర్తిగా సినిమాలపై ఫోకస్ చేసింది. మళ్లీ ఇప్పుడు పెళ్లి గురించి టాపిక్ వచ్చేసరికి మనసులో మాట బయటపెట్టింది రష్మిక మందన్న. మరో 8 ఏళ్ల తర్వాత కాని తాను పెళ్లి చేసుకోను అని ఫుల్ క్లారిటీ ఇచ్చింది. అప్పటి వరకు ఇలాగే సినిమాలతో బిజీగా ఉంటానని నమ్మకంగా చెబుతోంది రష్మిక. భీష్మ సినిమాతో పాటు తెలుగులో మరో మూడు సినిమాలతో బిజీగా ఉంది ఈ కన్నడ కస్తూరి.

More Related Stories