English   

కుక్క బిస్కెట్లు తిన్న రష్మిక

nithin
2020-02-14 19:50:45

 యంగ్ హీరో నితిన్ నటిస్తున్న భీష్మ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. విడుదల దగ్గరపడటంతో ప్రమోషన్స్ జోరు పెంచింది యూనిట్. ఆ ప్రమోషన్స్ లో భాగంగా  నితిన్ రష్మిక కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ నితిన్ ని రష్మిక గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పమంటే అతను చెప్పిన ఒక విషయం సంచలనం రేకెత్తించింది. మనం అందరం ఆకలి వేస్తే ఫ్రూప్ట్స్, బిస్కెట్స్, చిప్స్, టిఫిన్ వంటివి తింటాం… మరి తాను ఏం తింటుందో తెలుసా అని చెప్పబోయాడు నితిన్. ఆ సమయంలో రష్మిక నితిన్ ఆపడానికి చాలా ట్రై చేసింది. అయితే నితిన్ ఆగకుండా తను కుక్క బిస్కెట్లు తింటుందని చెప్పుకొచ్చాడు. దీనితో యాంకర్ కూడా ఒకింత ఖంగుతిన్నది. అసలు మనుషులు అందులోనూ ఒక హీరోయిన్ కుక్క బిస్కెట్లు తినడం ఏంటో ? అనుకునే లోపే వాటిని టెస్ట్ చేయడం కోసం తిన్నానని చెప్పుకొచ్చింది రష్మిక.

 

More Related Stories