English   

సాయి పల్లవి మరోసారి కేరాఫ్ తెలంగాణ..

sai
2020-02-15 06:53:43

ఫిదా సినిమాలో సాయి పల్లవి ఎంత పాపులర్ అయింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతోనే తెలుగులో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎక్స్ పోజింగ్ చేయకుండానే కోటి రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటుంది సాయి పల్లవి. ఈమె సినిమాలో ఉంది అంటే హీరోతో కూడా అవసరం లేదు. అంతగా ఇమేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఫిదా సినిమాలో బాన్సువాడ భానుమతి పాత్రకు ప్రాణం పోసి తెలంగాణ యాసలో అదరగొట్టింది సాయి పల్లవి. ఆ క్రెడిట్ మొత్తం శేఖర్ కమ్ములకు ఇచ్చేయాలి. ఇప్పుడు మరోసారి సాయి పల్లవి తెలంగాణ పాత్రలోనే చూపిస్తున్నాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ సినిమా సాయి పల్లవి తెలంగాణ ప్రాంతంలోనే ఉంటుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన ఏ పిల్ల పాటలో సాయి పల్లవి భాషను కూడా బయటపెట్టాడు శేఖర్ కమ్ముల. అందులో మొదటి నుంచి లిరిక్స్ ఉన్నా కూడా చివర్లో పల్లవి మాట్లాడిన ఒకే ఒక్క మాటతో ఆమె మళ్ళీ తెలంగాణ యాసలోనే కనిపించబోతుందని అర్థమైపోయింది. ముద్దు పెడితే కూడా ఏడుస్తారా ఏంది అంటూ సాయి పల్లవి.. నాగచైతన్యను అడిగిన తీరుతో మరోసారి ఇద్దరూ పూర్తిగా తెలంగాణ భాషలో అలరించబోతున్నారని అర్థమైపోయింది. ఫిదా సినిమాలో సాయి పల్లవి మాట్లాడిన తెలంగాణ భాషకు చాలా మంది అభిమానులున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి భాషతోనే అలరించబోతోంది ఈ ముద్దుగుమ్మ. సమ్మర్లో లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బిజినెస్ దాదాపు 35 కోట్లకు పైగా జరుగుతుంది. అందులో ముఖ్యంగా సాయి పల్లవి ఉండటంతో ఇమేజ్ మరింత పెరిగిపోతోంది. మరి ఈ సినిమాతో శేఖర్ కమ్ముల ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఫిదా తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని ఆయన చేస్తున్న సినిమా ఇది.

More Related Stories