English   

విజయ్ దేవరకొండ కెరీర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు..

vijay
2020-02-15 07:07:21

ఏడాది రోజుల కింద వ‌ర‌కు కూడా విజ‌య్ దేర‌వ‌కొండ అంటే ట్రెండ్ సెట్ట‌ర్. ఆయ‌న న‌టిస్తే సినిమా హిట్ అంతే.. క‌నీసం గెస్ట్ రోల్ చేసినా కూడా చ‌రిత్ర సృష్టిస్తాడు.. దానికి మ‌హాన‌టి సాక్ష్యం. ఇక గీత‌గోవిందం అంటే ఏకంగా 70 కోట్ల షేర్ తీసుకొచ్చి.. తెలుగు సినిమా చ‌రిత్రలోనే అత్య‌ధిక లాభాలు తీసుకొచ్చిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇంత‌గా ఫాలోయింగ్ పెంచుకున్నాడు విజ‌య్. మధ్యలో వచ్చిన నోటా సినిమా ఫ్లాప్ అయినా కూడా మళ్లీ టాక్సీ వాలా సినిమాతో తనేంటో నిరూపించుకున్నాడు విజయ్ దేవరకొండ. కానీ గతేడాది విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా దారుణంగా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు విజయ్ కెరీర్ డైలమాలో పడిపోయింది. ఈ సినిమాకు తొలి రోజు నెగటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుంచే కలెక్షన్లు పడిపోవడం మొదలుపెట్టాయి. డిస్ట్రిబ్యూటర్ లను డియర్ కామ్రేడ్ సినిమా దారుణంగా ముంచేసింది. విజ‌య్ కూడా నార్మ‌ల్ హీరోనే.. సూప‌ర్ మ్యాన్ కాదంటూ నీరు కార్చేసాయి. ఈ సినిమా ఫ్లాప్ త‌ర్వాత ఇప్పుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. ఒక్క సింగరేణి ఎపిసోడ్ మినహాయిస్తే సినిమా అంతా ఏమీ లేదు అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. తొలిరోజు వచ్చిన టాక్ తో ఈ సినిమా సేఫ్ జోన్ కు వెళ్లడం చాలా కష్టం. పైగా సినిమా బిజినెస్ కూడా 24 కోట్లకు పైగా జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  వరల్డ్ ఫేమస్ లవర్ అన్ని కోట్లు వసూలు చేయడం అసాధ్యంగా కనిపిస్తోంది. మంచి కథని తీసుకున్నా  కథనంలో మాత్రం క్రాంతిమాధవ్ ఎలాంటి మ్యాజిక్ చేయలేకపోయాడు. దాంతో  వరల్డ్ ఫేమస్ లవర్ వరల్డ్ ఫేమస్ కాలేకపోతోంది. వీటి తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనే దానిపై ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉంది.

ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ ఆశలన్నీ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫైటర్ సినిమాపైనే. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరవాత పూరి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే పూరి ఎప్పుడు ఎలాంటి సినిమా తీస్తాడో ఎవరికీ తెలియదు కాబట్టి ఫైటర్ వచ్చేంతవరకు దానిమీద అభిమానులు కూడా పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు. ఇలా అన్నీ రిస్కులు చేస్తూ ముందుకెళ్తున్నాడు. ఇందులో ఏది విజ‌య్ దేర‌వ‌కొండ కోరుకున్న బ్లాక్ బ‌స్ట‌ర్ ఇస్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వరల్డ్ ఫేమస్ లవర్ పరిస్థితి సందిగ్ధంలో పడిపోవడంతో ఇప్పుడు విజయ్ దేవరకొండ కెరీర్ కూడా డైలమాలో పడిపోయింది.

 

More Related Stories