చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి

చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారని ? మరోసారి రాజ్యసభకు వెళ్లబోతున్నారని అలాగే మరలా ఆయన కేంద్ర మంత్రి కూడా కాబోతున్నారని ప్రచారం మొదలైంది. ప్రజారాజ్యం పార్టీతో జనంలోకి వచ్చిన చిరంజీవి రాజకీయాలు తనకి సెట్ కావని తెలుసుకోడానికి ఎన్నో రోజులు పట్టలేదు. ఎంత వేగంగా రాజకీయాల్లోకి వచ్చారో అంతే వేగంగా ఆయన రాజకీయంగా కనుమరుగైపోయారు. ఎంతో అంచనాలతో గ్రాండ్ గా లాంచ్ అయిన ఆయన పార్టీ అప్పటి కాంగ్రెస్ లో విలీనం అయి ఉనికి లేకుండాపోయింది. పార్టీని స్థాపించినంత ఈజీగా ఆయన దాన్ని నడిపించలేకపోయారు. ఓ రాజ్యసభ సీటు కేంద్ర మంత్రి, రాష్ట్రంలో రెండు మంత్రి పదవులకు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేశారు.
రాజ్యసభ పదవీ కాలం ముగియక ముందు నుంచే కాంగ్రెస్ కు దూరమయిన చిరంజీవి సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చాక పూర్తిగా రాజకీయాలకి దూరం అయిపోయారు. తమ్ముడు పవన్ జనసేన పార్టీ పెట్టుకున్నా ఆయన తన సినిమాల సంగతి తాను చూసుకుంటున్నారు. అయితే సైరా సినిమాని ప్రమోట్ చేసుకునేందుకు కోసం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడంతో పొలిటికల్ రీ ఎంట్రీపై ఊహాగానాలు మొదలయ్యాయి. అంతే కాక జగన్ తీసుకున్న మూడు రాజధానులకు వ్యతిరేకంగా పవన్ పోరాడుతుంటే చిరంజీవి మాత్రం మద్దతు పలుకుతున్నారు. దీంతో పవన్ ను దెబ్బతీయడానికి వైసీపీ చిరుకు రాజ్యసభ సీటు ఇవ్వబోతోందంటూ ప్రచారం మొదలయింది. చూడాలి చిరంజీవికి మళ్ళీ కేంద్ర మంత్రి పదవి దక్కుతుందో? లేదో?