English   

లుంగీని వదలనంటున్న దేవరకొండ 

Vijay Deverakonda
2020-02-15 12:43:42

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన రాశిఖన్నా, క్యాథరిన్ త్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లాలు నటించారు. అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందుగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా యూనిట్ వైజాగ్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. 

ఈ వేడుకకు యూనిట్ మొత్తం హాజరవగా ఈ వేడుక కోసం విజయ్ స్పెషల్ గా రెడీ అయ్యాడు. తలకి పాగా, లుంగీ ధరించి ఈవెంట్ కి వచ్చాడు. మన హీరోలకు లుంగీ కొత్త కాకపోయినా విజయ్ కలర్ కాంబినేషన్ ఆకట్టుకుంది. పైగా ఓ పబ్లిక్ ఈవెంట్ కి ఎప్పుడూ హీరోలు ఈ స్థాయిలో రెడీ అయి రాలేదు. విజయ్ డ్రెస్సింగ్ వెరైటీగా ఉందని అంటున్నారు. అయితే ఇప్పుడు పూరీ సెట్స్ లో కూడా విజయ్ అలాగే కనిపించడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆ పిక్ ని వర్మ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. అయితే ఇది పూరీ సినిమా సెట్స్ లోనా లేక మరెక్కడైనానా అనేది తేలాల్సి ఉంది. 

More Related Stories