పూరీ ఛార్మీల రిలేషన్ మీద వర్మ సంచలన ట్వీట్

పూరీ జగన్నాథ్ ఛార్మి కౌర్ మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటో తెలియక ఇప్పుడు ఇండస్ట్రీలో జనం జుట్టు పీక్కుంటున్నారు. అసలు పూరీకి ఛార్మి ఏమవుతుంది..ఫ్రెండా..ఎంప్లాయా..పార్టనరా లేదంటే ఇంకేమైనా స్పెషలా అంటూ ఆరాలు తీస్తున్నారు. పూరీ మంచి వ్యక్తి. ఆయన నా బిజినెస్ పార్టనర్, నాకు మంచి స్నేహితుడిగా ఉండడం నా అదృష్టం’ అని ఛార్మి అంటున్నా వారి మధ్య ఏదో ఉందని చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు జనాలు. ఈ ఇద్దరూ కలిసి జ్యోతిలక్ష్మి సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత ఏమైందో ఏమో ఇద్దరూ అతుక్కుపోయారు.
ఆ తర్వాత పూరీ డౌన్ ఫాల్ మొదలవడంతో ఆఫీస్‌లోనే ఆయనతో పాటే.. అతడితో సమానంగా అన్ని వ్యవహారాల్లో తల దూర్చేంత ఫ్రీడమ్ ఛార్మికి వచ్చేసింది. ఆయన కంపెనీలోనే ఆయనతో సమాన స్థాయికి ఎదిగిపోయింది. పూరీ ఎక్కడుంటే ఛార్మి కూడా అక్కడే . ఇక తాజాగా హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ ఒక ఫోటో ని పోస్ట్ చేసిన ఆర్జీవీ, ఆ తదుపరి పోస్ట్ లో విజయ్ దేవరకొండ, ఛార్మి, పూరి జగన్నాధ్ ఉన్న ఫోటో ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసాడు. ప్రతి మగాడి విజయం వెనుక మాత్రమే కాదు, ముందు కూడా ఒక ఆడది ఉంటుంది అన్న క్యాప్షన్ పెట్టాడు. అయితే ఆ ఫోటో లో పూరి జగన్నాధ్, ఛార్మిలని గురించే వర్మ ట్వీట్ చేసినట్లు అర్ధమవుతోంది. అంటే వర్మ ఏమని హిట్ ఇస్తున్నారో ?