English   

ఆర్ఆర్ఆర్ నుండి తారక్ చరణ్‌ ఫస్ట్‌ లుక్ రిలీజ్‌ డేట్స్ 

Ram Charan
2020-02-15 13:41:14

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాక ప్యాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్.  బాహుబలి సిరీస్‌ తరువాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ చిత్రంలో మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌, యంగ్ టైగర్‌ ఎన్టీరఆర్‌లు హీరోలుగా నటిస్తున్నారు. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లను తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఇరువురు అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌, కొమరం భీంగా ఎన్టీఆర్‌ నటిస్తున్నారు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ లాంటివి కూడా రిలీజ్ కాలేదు, కానీ ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఆకాశాన్ని తాకే రేంజ్ లో ఉంది. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దాదాపు ఏడాది దాటిపోయినా సినిమాకు సంబంధించిన ఎటువంటి పోస్టర్ గానీ, ఫస్ట్ లుక్స్ గానీ ఏవీ వదలలేదు. దీంతో ఎప్పటి నుంచో వేచి చూస్తున్న నందమూరి, మెగా ఫ్యాన్స్ దర్శకుడు రాజమౌళి మీద గుర్రుగా ఉన్నారు. 

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ అప్డేట్ ప్రకారం రామ్ చరణ్‌ సంబంధించిన ఫస్ట్ లుక్‌ విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారట. మెగా హీరో చరణ్ పుట్టినరోజైన మార్చి 27నే మొదటి సర్‌ప్రైజ్ రాబోతుందని ప్రచారం జరుగుతోంది. మే20న ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆరోజు ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీమ్ లుక్ రిలీజ్ చేస్తారని కూడా అంటున్నారు. అయితే ఈ వార్తపై అధికారిక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

More Related Stories