English   

పునాదిరాళ్లు రాజ్ కుమార్ మృతి 

 Punadi Rallu Raj Kumar
2020-02-15 13:48:28

మెగాస్టార్ చిరంజీవిని సినిమాకి పరిచయం చేసిన ఆయన తొలి సినిమా దర్శకుడు పునాదిరాళ్లు గుడిపాటి రాజ్ కుమార్ ఈరోజు ఉదయం మృతిచెందారు. ఆయనకు కూడా ఆ సినిమా మొదటిది కాగా ఆ మొదటి సినిమాకే ఐదు నంది అవార్డులు దక్కించుకున్నారు. అయితే రాజ్ కుమార్ కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.  ఈ విషయం తెలిసి ఇటీవలే మెగాస్టార్  చిరంజీవి ఆయనకు అపోలో ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. 

అయితే ఆయన పెద్ద కుమారుడు కూడా అనారోగ్యంతో మృతి చెందడం, ఆ తర్వాత భార్య కూడా చనిపోవడంతో రాజ్ కుమార్ చిన్న కుమారుడి సంరక్షణలోనే ఉంటున్నారు. పైసా సంపాదన లేక చిన్న కుమారుడి మీద ఆధార పడి కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న శనివారం ఉదయం మృతిచెందారు. ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా ఉయ్యూరు. ఆయన భౌతికకాయాన్ని ఉయ్యూరు తీసుకు వెళ్ళేందుకు చిన్న కుమారుడు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన మృతి గురించి తెలిసిన సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
 

More Related Stories