English   

బాబాయ్ కోసం కథ కావాలంటున్న రామ్ చరణ్..

pk
2020-02-15 19:20:43

పవన్ కల్యాణ్ ఇప్పుడిప్పుడే మనసు మార్చుకుని సినిమాల వైపు వస్తున్నాడు. ఇన్నాళ్ళూ రాజకీయాలంటూ తిరిగిన ఈయన పింక్ సినిమా రీమేక్ తో మళ్లీ రంగేసుకున్నాడు. దాంతో పాటే క్రిష్ సినిమా కూడా మొదలుపెట్టాడు. ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే బ్రేక్ తీసుకుని ఐదు రోజులు రాజకీయాలు కూడా చేసాడు పవర్ స్టార్. ఫిబ్రవరి 16 నుంచి మళ్లీ షూటింగ్ కు రానున్నాడు పవన్. దాంతో దర్శక నిర్మాతలు వరసగా కథలు సిద్ధం చేసుకుంటున్నారు. కుర్ర దర్శకులు కూడా పవన్ తో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక రామ్ చరణ్ కూడా పవన్ తో సినిమా చేయాలని ఆరాటపడుతున్నాడు. ఇప్పటికే నిర్మాతగా మారి తండ్రితో వరస సినిమాలు నిర్మిస్తున్న చెర్రీ.. ఇప్పుడు పవన్ తో కూడా సినిమా నిర్మించాలని చూస్తున్నాడు. అందుకే కుర్ర దర్శకలు చెప్పే కథలు కూడా వింటున్నాడని తెలుస్తుంది. బాబాయ్ ఇమేజ్ కు సరిపోయే కథ దొరికితే కచ్చితంగా కొత్త ఏడాదిలో క్రేజీ కాంబినేషన్ అనౌన్స్ చేస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా రాబోతోందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయాన్ని మూడేళ్ల కింద కన్ఫర్మ్ చేశాడు పవన్ కళ్యాణ్ఎం తన ప్రొడక్షన్లో అన్నయ్యగారి అబ్బాయితో ఒక సినిమా చేయబోతున్నట్లు అప్పట్లో చెప్పారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అది కార్యరూపం దాల్చబోతోంది తెలుస్తుంది. తాను నిర్మించబోయే ఈ సినిమాలో ఒక అతిథి పాత్రలో నటిస్తాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇది పూర్తయిన తరువాత పవన్ కళ్యాణ్ నిర్మాణంలో రాబోయే సినిమాపై దృష్టి పెట్టనున్నాడు. ఏదేమైనా అబ్బాయి సినిమాను బాబాయ్ నిర్మించడమే హైలెట్ అనుకుంటే అందులో అతిధి పాత్ర కూడా చేస్తాడని వార్తలు రావడం మాత్రం మెగా అభిమానులకు నిజంగా పండగలాంటి వార్త. దాంతోపాటే చరణ్ కూడా పవన్ సినిమాపై ఫోకస్ చేస్తున్నాడు. ఈ రెండు వర్కవుట్ అయితే ఇంక పండగే.

More Related Stories