రాజశేఖర్ సరసన నటించబోతున్న శ్రీయ సరన్..

సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడమే ఇప్పుడు గగనం అయిపోయింది. అలాంటి వాళ్లకు శ్రీయను మించిన ఆప్షన్ కనిపించడం లేదు. ఇప్పటికీ ఈమె హీరోయిన్ గానే కొనసాగుతుందన్నా.. ఈమె కెరీర్ ఇప్పటికీ మూడు పువ్వులు ఆరు కాయలుగా వెలిగిపోతుందన్నా కూడా దీనికి కారణం సీనియర్ హీరోలే. శ్రీయ కోసం ఇప్పటికీ కొందరు హీరోలు వేచి చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మొన్నటికి మొన్న వరసగా రెండు సినిమాల్లో బాలయ్యతో రొమాన్స్ చేసిన శ్రీయ.. ఆ తర్వాత వెంకీతో నటించింది. ఇప్పుడు మరోసారి సీనియర్ హీరోతోనే జోడీ కట్టబోతుంది శ్రీయ. పెళ్లి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా రాజశేఖర్ హీరోగా నటించబోయే సినిమాలో శ్రీయ హీరోయిన్ గా నటించబోతుందనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి 19 ఏళ్లవుతోంది. ఆమెతో వచ్చిన వాళ్లంతా ఇప్పుడు ఫేడవుట్ అయిపోయారు. ఇంకొందరు ఆంటీలు అయిపోయారు. కానీ శ్రీయ మాత్రం ఇప్పటికీ అమ్మాయిగానే ఉంది. పెళ్లైన తర్వాత కూడా అదే ఫిజిక్ మెయింటేన్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఏ మాయ చేస్తుందో తెలియదు గానీ 17 ఏళ్లుగా అదే ఫిజిక్ మెయింటేన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది ఈ 38 ఏళ్ల బ్యూటీ.
తెలుగు ఇండస్ట్రీకి 2001లో వచ్చిన శ్రీయ.. హిందీలో ఓ ఏడాది ముందుగానే అడుగుపెట్టింది. టాలీవుడ్ టాప్ హీరోస్ అందరితోనూ ఆడిపాడిన శ్రీయ.. ఇప్పటికీ అవకాశాల వేటలో ముందే ఉంది. ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తోంది శ్రీయ. తెలుగులో సీనియర్ హీరోలకు శ్రీయ బెస్ట్ ఆప్షన్ గా మారిపోయింది. సినిమాకు కనీసం 35 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది ఈ భామ. దీనికి తోడు ఫ్యాషన్ వీక్స్, ఈవెంట్స్, డాన్సులు అంటూ ఏడాదికి కనీసం 3 కోట్ల వరకు వెనకేస్తోంది శ్రీయ. పైగా ఇప్పటికీ అదిరిపోయే ఫిజిక్ తో హాట్ ఫోటోషూట్లతో మతులు పోగొట్టేస్తోంది ఈ భామ. ఈ మధ్యే బీచ్ లో అదిరిపోయే బికినీ షో చేసింది. ఐదేళ్లు పర్ ఫెక్ట్ ఫిజిక్ మెయింటేన్ చేయడానికే నానా తిప్పలు పడుతున్న ఈ రోజుల్లో.. ఏకంగా 19 ఏళ్లు ఒకేలా కనిపించడం అంటే చిన్న విషయం కాదు. ఆ సీక్రేట్ ఏంటో మిగిలిన హీరోయిన్లకు కూడా చెబితే కాస్త హెల్ప్ అవుతుంది కదా శ్రీయా