English   

బాలయ్య తో రష్మిక…ఎందుకు వెళ్లిందంటే

nbk
2020-02-16 06:45:04

ప్రపంచ చైల్డ్ హూడ్ కాన్సర్ దినం సందర్భంగా హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు నటి రష్మిక పాల్గొన్నారు. పీడియాట్రిక్ కాన్సర్ ఫండ్‌ను ప్రారంభించారు. కాన్సర్ పిల్లల వైద్యం కోసం ఆస్పత్రి వైద్యులు ఒక రోజు శాలరీని డొనేట్ చేశారు. పిల్లలు క్యాన్సర్ భారిన పడటం బాధాకరమన్నారు బాలకృష్ణ. మందు, సిగరేట్ల వల్ల కాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. కాన్సర్ వైద్యం అందరికి తక్కువ ఖర్చుతో అందాలని ఆయన అమ్మ ఆకాంక్ష ఆ మేరకు నో ప్రాఫిట్, నో లాస్ లో బసవతారకం ఆస్పత్రిని రన్ చేస్తున్నట్టు తెలిపారు బాలకృష్ణ.
ఇక పిల్లలకు క్యాన్సర్ మీద అవగాహన ఉండదు కాబట్టి పెద్దలే బాధ్యతగా వహించాలన్నారు నటి రష్మిక. తమ కుటుంబంలో కూడా క్యాన్సర్ బాధితులు ఉన్నట్టు తెలిపారు. బసవతారకం ఆస్పత్రిలో వైద్య సేవలకు అభినందనలు తెలిపారు నటి రష్మిక.

 

More Related Stories