English   

అల్లు అర్జున్ బాలీవుడ్ వెళ్తున్నాడా.. ముంబైలో ఇళ్లంట..

allu
2020-02-16 07:40:28

అల్లు అర్జున్ ఈ మధ్య బాగా మారిపోయాడు. బాగా ప్రొఫెషనల్ అయిపోయాడు బన్నీ. ఒకప్పుడు తెలుగు హీరోలా ఆలోచించే ఆ హీరో.. ఇప్పుడు మాత్రం బాలీవుడ్ స్టైల్ ఫాలో అయిపోతున్నాడు. అందుకే ఆఫీస్ కూడా కార్పోరేట్ రేంజ్ లోనే కట్టుకుంటున్నాడు. దాంతో పాటు హైదరాబాద్‌లో కొత్త ఇంటికి ముహూర్తం పెట్టాడు అల్లు అర్జున్. ఇక్కడే ఇంద్రభవనం లాంటి ఇంటిని నిర్మించుకుంటున్నాడు. తండ్రి ఆస్తులు పంచేసిన తర్వాత పూర్తిగా మారిపోయాడు బన్నీ. తనకంటూ సొంత సామ్రాజ్యాన్ని నిర్మించుకునే పనిలో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు త్వరలోనే సొంత నిర్మాణ సంస్థ కూడా మొదలుపెడతాడని వార్తలు వినిపిస్తున్నాయి. 'అల.. వైకుంఠపురములో' బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీలో  మార్పులు కనిపిస్తున్నాయి. ఈ సినిమాతో ఏకంగా బన్నీ రేంజ్ రెండింతలు పెరిగింది. ఇప్పటి వరకు 12 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న బన్నీ.. ఇప్పుడు ఏకంగా 25 కోట్లకు పెరిగిపోయాడు. 150 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది అల వైకుంఠపురములో. ఈ చిత్రం తర్వాత బన్నీ సినిమాలపై బాలీవుడ్ లో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈయన ముంబైలో కూడా ఇళ్లు కొనాలని చూస్తున్నాడు. ఇదే విషయాన్ని బన్నీ కన్ఫర్మ్ చేసాడు. తనకు ముంబై అంటే చాలా ఇష్టమని.. అక్కడికి వచ్చినపుడు తెలిసిన వాళ్లను కలుస్తుంటానని చెప్పాడు బన్నీ. అయితే అక్కడ ఉండటానికి సొంత ఇళ్లు మాత్రం లేదని.. తమ గీతా ఆర్ట్స్ ఆఫీస్‌లోనే ఉంటానని చెప్పుకొచ్చాడు. అయితే తన సొంతది కాదని చెప్పడం గమనార్హం. దాంతో ఇప్పుడు ముంబైలో కూడా కొత్త ఇంటిని కొనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు అల్లు వారబ్బాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే చాలా ఏళ్ళుగా అక్కడ సినిమాలు చేయాలని చూస్తున్నాడు. కానీ సరైన కథ దొరికితే బాలీవుడ్ వెళ్లాలని చూస్తున్నాడు. ఇప్పటికే సౌత్‌లో బన్నీకి మంచి ఫాలోయింగ్ ఉంది.. ఇప్పుడు బాలీవుడ్ కూడా వెళ్ళి అక్కడ కూడా సత్తా చూపించాలని చూస్తున్నాడు అల్లు వారబ్బాయి. ఇప్పుడు ముంబైలో ఇల్లు కొంటే మాత్రం బన్నీ బాలీవుడ్ వెళ్లిపోయినట్లే.

More Related Stories