English   

వరల్డ్ ఫేమస్ లవర్ కలెక్షన్స్... వీకెండ్ పరిస్థితి ఏంటి...

WFL weekend collections.jpg
2020-02-16 13:25:00

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ తెరకెక్కించిన సినిమా వరల్డ్ ఫేమస్ లవర్. ఈ సినిమాకు తొలిరోజే కలెక్షన్స్ తక్కువగా వచ్చాయి. నెగిటివ్ టాక్ రావడంతో వసూళ్లు కూడా అంచనాలు తప్పాయి. 5 కోట్లతో తొలిరోజు రేస్ మొదలుపెట్టిన విజయ్.. రెండో రోజు 2 కోట్ల రేంజ్ కు పడిపోయాడు. తొలి రెండు రోజుల్లో ఈ చిత్రం 8 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లకు పైగా వసూలు చేసింది ఈ చిత్రం. వీకెండ్ ముగిసేనాటికి అసలు పరిస్థితి బయటికి రానుంది.

కచ్చితంగా విజయ్ దేవరకొండకు ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. ఎందుకంటే భారీ అంచనాలతో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్.. వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను నిరాశపరుస్తుంది. ఇక బయ్యర్లు కూడా ఇప్పుడిప్పుడే భయపడుతున్నారు కూడా. ఎందుకంటే విజయ్ పై ఉన్న నమ్మకంతో ఈ చిత్రాన్ని 24 కోట్లకు పైగానే కొన్నారు వాళ్లు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే సినిమా వసూళ్లు అయితే అంతగా వచ్చేలా కనిపించడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో మరే సినిమా లేకపోయినా కూడా విజయ్ దేవరకొండ సినిమాకు ఆడియన్స్ ఆసక్తి చూపించడం లేదు.

నెగిటిక్ టాక్ సినిమాపై చాలా ప్రభావం చూపిస్తుంది. డియర్ కామ్రేడ్ సినిమాతోనే నిరాశ పరిచిన విజయ్.. మరోసారి అదే చేస్తున్నాడు. ఇప్పుడు ఈ టాక్ తో ఈ సినిమాను ఎంతదూరం తీసుకెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories