English   

రవితేజను దారుణంగా మోసం చేసిన దర్శకులు...

Ravi Teja.jpg
2020-02-16 16:26:00

నిజంగానే రవితేజ దర్శకుల చేతిలో మోసపోతున్నాడు. కథ చెప్పేటప్పుడు ఒకలా.. తీసేటప్పుడు మరోలా చేస్తున్నారు ఈ తరం దర్శకులు. అందుకే వాళ్లను అంచనా వేయడంలో పూర్తిగా విఫలం అవుతున్నారు మాస్ రాజా. గత మూడేళ్లుగా మరీ దారుణంగా ఉంది ఈయన కెరీర్. 2017లో అనిల్ రావిపూడి తెరకెక్కించిన రాజాదిగ్రేట్ సినిమాతో విజయం అందుకున్న రవితేజ.. ఆ తర్వాత వరుసగా నాలుగు ఫ్లాపులు ఇచ్చాడు.

కొత్త దర్శకుడు అని కథని నమ్మి అవకాశం ఇస్తే టచ్ చేసి చూడు సినిమాతో విక్రం సిరికొండ రవితేజను పూర్తిగా ముంచేశాడు. ఆ తర్వాత సీనియర్ దర్శకుడు కదా అని శీను వైట్లను నమ్మి అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా చేశాడు రవితేజ. మల్టిపుల్ డిజార్డర్ కథ అంటూ ఎప్పటికీ మర్చిపోలేని డిజాస్టర్ ఇచ్చాడు ఈ దర్శకుడు. ఇక ఫ్యామిలీ సినిమాల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నేల టికెట్ రూపంలో రవితేజకు దారుణమైన ఫ్లాప్ ఇచ్చాడు. మొన్నటికి మొన్న విభిన్నమైన సినిమాలు చేస్తాడు అనే పేరున్న విఐ ఆనంద్ కూడా రవితేజ డిస్కో రాజా రూపంలో డిజాస్టర్ ఇచ్చాడు.

నిజానికి ఆయా దర్శకులు చెప్పిన కథకు రవితేజ బాగానే ఇంప్రెస్ అయ్యాడు. చనిపోయిన మనిషి మళ్లీ బతకడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. కానీ దాన్ని స్క్రీన్పై తెరకెక్కించేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోలేదు దర్శకుడు ఆనంద్. ఇక మల్టిపుల్ డిజార్డర్ కథ చెప్పి మరోసారి అపరిచితుడు సినిమా తీశాడు దర్శకుడు శ్రీను వైట్ల. అంతకుముందు రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ.. రవితేజ విషయానికి వచ్చేసరికి నేల టికెట్ దగ్గర పూర్తిగా గాడి తప్పాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ అంటూ విక్రమ్ కూడా టచ్ చేసి చూడు సినిమాతో రవితేజను మోసం చేశాడు.

కుర్ర దర్శకులు.. మంచి ఐడియాలు కదా అని అవకాశం ఇస్తే రవితేజ కెరీర్ ను నిండా ముంచేసారు వీళ్లంతా. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో క్రాక్ సినిమా చేస్తున్నాడు. దాంతోపాటే రమేష్ వర్మతో కూడా మరో సినిమాకు కమిట్ అయ్యాడు మాస్ రాజా. మరి ఈ సినిమాలైన ఆయన కెరీర్ ను గాడిన పెడతాయో లేదో చూడాలి.

More Related Stories