English   

రెండేళ్ళ క్రితం ఆగిపోయిన సినిమా చేస్తున్న శౌర్య

nag
2020-02-16 19:11:29

మొన్న వారమే ‘అశ్వథ్థామ’గా ప్రేక్షకుల్ని పలకరించాడు యువ హీరో నాగశౌర్య. ఇప్పటి వరకూ మునుపెన్నడూ లేనంతగా తనలో ఉన్న మాస్ యాంగిల్ ని బయటపెట్టి ప్రేక్షకుల్ని అలరించాడు. ఆ ఉత్సాహంతో రెండు చిత్రాలు పట్టాలెక్కిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ మీద ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగమ్మాయి లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం కాబోతున్నారు. రీతూ వర్మ కధానాయికగా నటించనున్న ఈ సినిమా ఫిబ్రవరి 19 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ కి వెళ్లనుంది. ఇక ఈ సినిమా విషయం పక్కన పెడితే రెండేళ్ళ క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుని సైలెంట్ అయిపోయిన సినిమాని కూడా మళ్ళీ మొదలెట్టనున్నాడు శౌర్య. అయితే సినిమాకి నిర్మాత మారనున్నట్టు చెబుతున్నారు. 2018లో నాగశౌర్య హీరోగా  భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద ప్రసాద్ నిర్మాతగా  రాజా కోలుసు దర్శకుడిగా ఒక సినిమా మొదలయింది. అదే ఏడాది ఆగస్టు నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని, మిగిలిన నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత అప్పట్లో ప్రకటించారు. 'ఛలో' సినిమాతో మంచి హిట్‌ అందుకున్న వెంటనే ఈ సినిమా ప్రకటించారు. ఆ తర్వాత ఆగిపోయిన ఆ సినిమాని ఇప్పుడు ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేష్‌ ఎస్‌.కోనేరు నిర్మిస్తున్నారు. ఇది కాక నటుడు, దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలోనూ ఓ చిత్రం చేస్తున్నాడు శౌర్య. 

More Related Stories