English   

మరోమారు రేసు గుర్రం కాంబినేషన్

allu
2020-02-16 19:43:42

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన అల వైకుంటపురంలో సినిమా మొన్న సంక్రాంతికి రిలీజ్ అయి బంపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా మొదటి ఆట నుండే మంచి హిట్ టాక్ తో దూసుకు పోయింది. దీంతో మునుపెన్నడూ లేని విధంగా నాన్ బాహుబలి రికార్డ్స్ కూడా బద్దలు కొట్టింది ఈ సినిమా. ఇక బన్నీ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు అర్జున్‌. ఆ తర్వాత వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్‌’ చిత్రం చేయనున్నాడు. ఇవి రెండు పూర్తయ్యాక ఏ సినిమా చేయనున్నాడు ? అనే ఆసక్తి నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన తర్వాతి సినిమా సురేందర్ రెడ్డితో చేయనున్నాడు. గతంలో సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన ‘రేసుగుర్రం’ ఘన విజయం అందుకుంది. బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. బన్నీకి ఈ సినిమా మంచి జోష్ ఇవ్వడమే కాక కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది. మరోసారి అదే ఉత్సాహంతో సినిమా చేసేందుకు బన్నీ సురేందర్ రెడ్డిలు సన్నద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మీద స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి.

 

More Related Stories