English   

మహేష్ బాబు రెండో భార్య గురించి నమ్రత శిరోద్కర్ ఆసక్తికర కామెంట్స్..

maheshbabu
2020-02-17 07:15:10

అసలు మహేష్ బాబుకు రెండో భార్య ఎక్కడుంది.. అలాంటప్పుడు ఆమె మహేష్ రెండో భార్య గురించి ఎలా కామెంట్ చేస్తుంది.. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అనుకుంటున్నారా.. వినడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది కానీ నిజంగానే మహేష్ బాబు మరో భార్య గురించి నమ్రతా శిరోద్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తను సూపర్ స్టార్ కు రెండో భార్య అని చెప్పుకొచ్చింది ఈమె. దానికి ప్రత్యేకంగా కారణాలు కూడా ఏమీ లేవు. ఎందుకంటే మహేష్ బాబు మొదటి భార్య సినిమా. సాధారణంగా వృత్తి నా మొదటి పెళ్ళాం అని చాలామంది చెబుతుంటారు. అలాగే మహేష్ బాబు కూడా సినిమాలు ప్రాణంగా చూసుకుంటాడని.. ఆయన లోకం అదే అని చెబుతుంది నమ్రత. అందుకే తాను ఆయనకు రెండో భార్యగా ఉంటానని.. మొదటి భార్య ఎప్పుడూ సినిమాలే అని సరదాగా కామెంట్ చేసింది నమ్రత శిరోద్కర్. ఈమె వ్యాఖ్యలు విన్న తర్వాత అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మహేష్ బాబు రెండో భార్య ఏంటి అంటూ నమ్రత మాటలను ముందుగా అపార్థం చేసుకున్నా.. తర్వాత ఆయనకు సినిమాపై ఉన్న ఆమె మాటల్లో విని అభిమానులు ఆనంద పడ్డారు. తెలుగు ఇండస్ట్రీలో కుటుంబానికి అత్యంత ఎక్కువ సమయం ఇచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆయనకు సెలవులు దొరికినా దొరకకపోయినా కూడా కుటుంబానికి మాత్రం సమయం ఇస్తూనే ఉంటాడు.

అంత బిజీలో కూడా ఫ్యామిలీని పట్టించుకోవడం అనేది చిన్న విషయం కాదు. కుటుంబానికి అంత ప్రాముఖ్యత ఇచ్చినా సినిమాలను అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు మహేష్. అందుకే తమ కుటుంబంలో సినిమాలు కూడా ఎప్పుడూ ఒక భాగం అంటూ చెప్పుకొచ్చింది నమ్రత. ఆయన రెండో భార్యగా ఉండటం సంతోషంగా ఉంది అని.. మొదటి భార్యను ఎప్పుడూ మహేష్ బాబు ప్రాణంగా చూసుకుంటాడు అని ఈమె సరదాగా కామెంట్ చేసింది. మహేష్ బాబుకు మరో భార్య మాత్రం అనేది మాత్రం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అసలు విషయం తెలిసిన తరువాత అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ప్రస్తుతం హాలిడేలో ఉన్న మహేష్ బాబు.. మే నుంచి వంశీ పైడిపల్లి సినిమా మొదలు పెట్టనున్నాడు

More Related Stories