English   

హీరో నితిన్ పెళ్ళాడే శాలిని ఎవరంటే

shalini
2020-02-17 14:50:28

హీరో నితిన్ ఎంగేజ్మెంట్ షాలిని అనే అమ్మాయితో రెండ్రోజుల క్రితం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాలిని ఎనిమిదేళ్లుగా పరిచయం ఉందని, ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేశాడు నితిన్. ఇక మొన్న సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్‌మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ.. ‘‘పెళ్లిపనులు ఆరంభం.. మ్యూజిక్ స్టార్ట్స్.. మీ ఆశీస్సులు కావాలి’’.. అంటూ నితిన్ ట్వీట్ చేశాడు. అయితే నితిన్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి పేరు మాత్రమె బయటకు వచ్చింది కానీ ఆమె ఎవరు, ఆమె వివరాలు ఏంటనేది ఎవరికీ తెలీదు. నితిన్ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం మేరకు ఆమె నాగర్‌కర్నూల్‌కు చెందిన ఆమెగా చెబుతున్నారు. నగర్ కర్నూల్ లో ప్రగతి నర్సింగ్‌ హోమ్‌ను నిర్వహిస్తున్న డా.సంపత్‌ కుమార్‌, నూర్జహాన్‌ల రెండవ కుమార్తెనే ఈ షాలినీ అంటున్నారు. 1989 సెప్టెంబర్ 27న జన్మించిన షాలిని నితిన్‌ కన్నా షాలిని సుమారు ఆరేళ్ల చిన్న. నితిన్ ఎత్తు 5.7 అడుగులు అని సమాచారం. ఆమె లండన్ లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ పూర్తి చేసింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఇద్దరికీ పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమకి దారితీసిందని అంటున్నారు. వీరిద్దరి పెళ్లి ఏప్రిల్ 16 న దుబాయ్ లో జరగనుంది. ఏప్రిల్‌ 21న హైటెక్‌స్ లో వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేయనున్నరని తెలుస్తోంది.

 

More Related Stories