అయ్యో త్రివిక్రమ్..మళ్ళీ కాపీ ముద్ర

విలక్షణ దర్శకుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా 'అల.. వైకుంఠపురములో' అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతికి రిలీజయిన ఈ సినిమా బ్లాక్ బస్తర్ హిట్ గా నిలిచింది. అయితే దాని మీద కూడా కాపీ ముద్రే పడింది. మొదట్లో త్రివిక్రమ్ నుంచి జాలువారిన పదాలు ఇప్పుడు రానని మొరాయిస్తున్నాయేమో.. మునుపటి పంచులు, డైలాగ్స్ ఇప్పటి అయన సినిమాల్లో కనిపించట్లేదు.. మాటలే కాదు సినిమా కథలు కూడా ఎక్కడో చూసి కాపీ కొడుతున్నాడనే ప్రచారాన్ని ఆయన నిజం చేస్తున్నారేమో అనిపిస్తోంది.
కొన్ని సినిమాలకి రచయితగా పని చేసిన కృష్ణ అనే ఆయన 2005లో త్రివిక్రమ్ ని కలిసి ఈ స్టోరీని నరేట్ చేశాడట. 2013లో ఈ కథని ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ కూడా చేసుకున్నాడట. తన స్క్రిప్ట్ ఫస్ట్ పేజ్ కాపీని త్రివిక్రమ్‌కి ఇచ్చానని కూడా చెబుతున్నాడు కృష్ణ.అలా తన కథతో అల వైకుంఠపురములో సినిమాని త్రివిక్రమ్ తెరకెక్కించాడని ఆయన ఆరోపిస్తున్నాడు. తాను చెప్పిన కథని దశ-దిశ అనే టైటిల్‌తో తెరకెక్కించాలనుకున్నానని, కాని త్రివిక్రమ్ నా కథతో అల వైకుంఠపురములో చిత్రం తెరకెక్కించాడని అంటున్నాడు. ఆయనకి లీగల్ నోటీసులు కూడా పంపిస్తానని ఆయన చెబుతున్నారు.