బ్యాంకింగ్ మోసం నుండి బయటపడ్డ బాలయ్య సతీమణి

బ్యాంకింగ్ మోసాలకి బలవడం ఇప్పుడు కామన్ అయిపొయింది. అది కామన్ మ్యాన్ నుండి సెలబ్రిటీ నుండి వరకూ ఎవరూ మినహాయింపు కాదు. కానీ త్రుటిలో ఆ మోసం బారిన పడకుండా తప్పించుకున్నాడు సినీ హీరో బాలకృష్ణ సతీమణి. పోలీసుల వివరాల ప్రకారం బాలకృష్ణ సతీమణి వసుంధరకు హెచ్ డీ ఎఫ్ సీ బంజారాహిల్స్ బ్రాంచ్లో అకౌంట్ ఉంది. అయితే ఆమె ఇటీవల మొబైల్ యాప్ కోసం దరఖాస్తు చేసుకున్న క్రమంలో బ్యాంకు అధికారులకు సమాచారం అందింది.
అయితే ఆమె నిజంగానే దాని కోసం అప్ప్లై చేశారా లేదా అనే విషయాన్నీ ధ్రువీకరించుకునేందుకు బ్యాంకు రిలేషన్షిప్ మేనేజర్లు ఫణీంద్ర, శ్రీనివాస్ ఆమెకు ఫోన్ చేశారు. తాను యాప్ కోసం ఎలాంటి దరఖాస్తు చేయలేదని ఆమె సమాధానం ఇవ్వడంతో ఆ అప్లికేషన్ మీద సంతకం చేసిందెవరనే కోణంలో వారు విచారణ జరిపారు. బ్యాంకులో కొత్తగా చేరిన అకౌంటెంట్ శివ ఈ పని చేసినట్టు నిర్ధారించిన వారు విషయాన్ని ఆమెకు చెప్పారు. దీంతో వసుంధర ఆర్థిక లావాదేవీలు చూసే వెలగల సుబ్బారావు అనే మేనేజర్ ఈ విషయం మీద జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.