English   

ధనుష్ కోసం అల్లు అరవింద్ మాస్టర్ ప్లానింగ్..

Dhanush 40
2020-02-17 15:21:13

తమిళ హీరో ధనుష్ తెలుగు ఇండస్ట్రీలో మార్కెట్ సంపాదించుకోవడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. మధ్యలో రఘువరన్ బీటెక్ సినిమా విజయం సాధించిన కూడా ఆ తర్వాత విడుదలైన ఏ సినిమా కూడా ధనుష్ కు తెలుగులో విజయాన్ని తీసుకురాలేకపోయింది. ఇలాంటి సమయంలో కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న సినిమాతో తెలుగులో గుర్తింపు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు ధనుష్. దానికోసం అల్లు అరవింద్ సహ నిర్మాణ సంస్థను నమ్ముకుంటున్నారు ధనుష్.

'లవ్ ఫెయిల్యూర్', 'గురు', గేమ్ ఓవర్ లాంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కులను పలకరించిన  'వై నాట్' స్థూడియోస్ నిర్మాణంలో పాన్ ఇండియా స్టార్ గా ఇమేజ్ వున్న‌ హీరో ధనుష్ హీరోగా.. పిజ్జా, జిగర్ తండా(చిక్కడు దొరకడు), పేట  సినిమాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో డి40(ధ‌నుష్‌-40) ని తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌ముఖ నిర్మాత‌ ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ స్వరాలు సమకూరుస్తున్నారు. 

భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, గీత‌ గోవిందం, టాక్సివాలా, ప్ర‌తిరోజుపండ‌గే లాంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ ని అందించిన  నిర్మాణ సంస్థ‌లు జిఏ2 పిక్చ‌ర్‌, యువి క్రియెష‌న్స్  ఇప్ప‌డు జిఏ2యువి ద్వారా ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ రెండు సంస్ధ‌లు ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌ట‌మే డి40 కున్న క్రేజ్ ని తెలియ‌జేస్తుంది. త్వరలోనే మిగిలిన వివరాలు తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

More Related Stories