English   

బాలకృష్ణ గుండు ఇంకా ఎన్ని రోజులు.. బోయపాటి సినిమా ఎప్పుడు..

Balakrishna
2020-02-17 16:09:45

అభిమానుల్ని ఈ రెండు ప్రశ్నలు ఇప్పుడు బాగానే వేధిస్తున్నాయి. ఇప్పటికే బోయపాటి సినిమా మొదలు పెట్టాల్సి ఉన్న ఇంకా అది సెట్స్ పైకి రాలేదు. దానికి మరిన్ని రోజులు పట్టేలా కనిపిస్తోంది. అన్నింటికీ మించి బాలయ్య ఇప్పటికి గుండుతోనే కనిపిస్తున్నాడు. తాజాగా రష్మిక మందన్న, బాలయ్య ఇద్దరూ కలిసి బసవతారకం హాస్పిటల్ లో ఒక చిన్న కార్యక్రమం చేశారు. అందులో కూడా గుండుతోనే ఉన్నాడు బాలయ్య. ఉన్నట్లుండి నందమూరి బాలకృష్ణ గుండుతో కనిపించడం అభిమానులకు షాక్ ఇచ్చింది. అయితే సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు ఈయన. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు. 

మొన్నటికి మొన్న రూలర్ సినిమా కోసం ఏకంగా 11 కేజీలు తగ్గిపోయాడు బాలయ్య. ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమా కోసం అంతకంటే తగ్గాడు కూడా. ఇందులో తండ్రి కొడుకులుగా నటించబోతున్నాడు నందమూరి నటసింహం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈయన నటించబోయే సినిమా ఇప్పటికే ప్రారంభమైంది కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. దానికి కారణం తన బరువు తగ్గించుకోవడమే అనుకున్నారు ఇన్ని రోజులు. గుండు కూడా సినిమా కోసమే అని ప్రచారం జరిగింది. కానీ అసలు విషయం మాత్రం అది కాదు. 

ఈయన దుబాయిలో హెయిర్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారని కొన్ని రోజుల కింద వార్తలు వచ్చాయి. అందుకే బాలయ్య గుండు చేయించుకొని అదే లుక్ మెయింటెన్ చేస్తున్నాడు. హెయిర్ సర్జరీ అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. సింహా, లెజెండ్ సినిమాలలో బాలయ్యను కొత్తగా చూపించి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు బోయపాటి శ్రీను. ఈ సారి కూడా ఇదే చేయబోతున్నాడు ఈయన. కథ ఎలా ఉన్నా కూడా బాలయ్య గెటప్ తోనే సినిమాను సగం హిట్ చేస్తాడు బోయపాటి. ఇప్పుడు కూడా ఇదే చేయబోతున్నాడు. 

నిజానికి ఇప్పటికే బోయపాటి, బాలయ్య సినిమా సెట్స్‌ పైకి రావాలి. కానీ ఆ మధ్య బోయపాటి తల్లి సీతారామమ్మ చనిపోవడంతో కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసాడు బాలయ్య. ఇప్పుడు బాలయ్య హెయిర్ ప్లాంటేషన్ సినిమాకు అడ్డుపడుతుంది. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌తో రానున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్నాడు.  

More Related Stories