English   

రాజమౌళితోనే నా యుద్ధం అంటున్న దర్శకుడు శంకర్..

shankar
2020-02-17 19:39:27

పేరుకు వాళ్ళిద్దరు దక్షిణాది దర్శకులు. అయినా కూడా ఇండియా మొత్తం వాళ్ళిద్దరికీ సూపర్ క్రేజ్ ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడు వాళ్ళిద్దరూ. వాళ్లే రాజమౌళి, శంకర్. ఒకరు తమిళంలో మరొకరు తెలుగులో అద్భుతాలు చేస్తున్నారు. ఈ మధ్య దర్శకుడు శంకర్ రేస్ లో కాస్త వెనుకబడ్డారు. ఈయన రజనీకాంత్ తో తెరకెక్కించిన 2.0 సినిమా అంచనాలను అందుకోలేదు. అదే సమయంలో రాజమౌళి మాత్రం బాహుబలి సినిమాతో తన రేంజ్ ఆకాశానికి పెంచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో రాజమౌళి సినిమాకు ఎదురొచ్చే ధైర్యం ఏ హీరో గాని దర్శకుడు కానీ ఇండియాలోనే చేయడం లేదు. కానీ శంకర్ మాత్రం తన సినిమాను రాజమౌళికి పోటీగా విడుదల చేయాలని చూస్తున్నాడు. ప్రస్తుతం ఈయన కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ వేగంగానే జరుగుతుంది. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. దేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అంచనా వేస్తూ శంకర్ ఈ కథ రాసుకున్నాడు. 20 ఏళ్ల కిందట వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ ఇది. ఇందులో కాజల్ అగర్వాల్ 80 ఏళ్ల బామ్మగా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను జనవరిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. అదే నెలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న మెగా మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్ విడుదల కానుంది. అందుకే సంక్రాంతికి మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లాంటి హీరోలు కూడా సైలెంట్ గా సైడ్ ఇచ్చారు. కానీ ఇప్పుడు దర్శకుడు శంకర్ మాత్రం రాజమౌళి సినిమాకు పోటీగా తన సినిమాను తీసుకురావాలని చూస్తున్నాడు. ఒకవేళ ఇదే జరిగితే శంకర్ వర్సెస్ రాజమౌళి ఫైట్ బాక్సాఫీస్ దగ్గర ఓ రేంజ్ లో జరుగుతుంది. ఈ రెండు సినిమాల బిజినెస్ 600 కోట్లకు పైగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. 

More Related Stories