English   

భీష్మ ట్రైలర్.. నితిన్ పొలంలో మొలకలు వచ్చేలా ఉన్నాయి..

nithin
2020-02-17 20:59:40

త్రివిక్రమ్ తెరకెక్కించిన అ ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకూ మరో హిట్ అందుకోలేకపోయాడు కుర్ర హీరో నితిన్. ఎన్ని సినిమాలు చేసినా కూడా ఒకే ఫలితం రిపీట్ అవుతూ ఉంది. దాంతో శ్రీనివాస కళ్యాణం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ఇప్పుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన భీష్మ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఫిబ్రవరి 21న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ట్రైలర్ బయటకు వచ్చింది. ఇది చూసిన తర్వాత సినిమా కేవలం కామెడీ ఎంటర్టైనర్ కాదు అందులో కథ కూడా చాలా ఉంది అని అర్థమవుతుంది. సేంద్రీయ వ్యవసాయం నేపథ్యంలో ఈ కథ రాసుకున్నాడు దర్శకుడు వెంకీ కుడుముల. చలో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకొని వస్తున్నాడు వెంకీ కుడుముల. ఈయన మొదటి సినిమా కూడా ఫిబ్రవరిలోనే విడుదలైంది. ఇప్పుడు రెండో సినిమా కూడా మరోసారి ఫిబ్రవరిలోనే వస్తుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మించాడు సూర్యదేవర నాగ వంశీ.

ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత రైతులు పొలాలు వ్యవసాయం అంటూ క్లాస్ పీకినట్టు కాకుండా కామెడీతో చెప్పాల్సిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు వెంకీ. అశ్వద్ధామ సినిమా అదిరిపోయే విలనిజం చూపించిన జిస్సు గుప్తా ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించాడు. నితిన్ కూడా సినిమాలో చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం కాస్త బరువు కూడా తగ్గిపోయారు ఈ కుర్రహీరో. రష్మిక మందన హీరోయిన్ కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. నితిన్ రష్మిక కెమిస్ట్రీ కూడా బాగుంది. ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా ఈ సినిమాతో నితిన్ హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. నా పొలంలో మొలకలు వచ్చేలా ఉన్నాయంటూ నితిన్ చెప్పిన డైలాగ్ నిజమయ్యేలా కనిపిస్తోంది.

More Related Stories