మంచు మనోజ్ సరసన ఫేమస్ యాంకర్

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మంచు మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ అనే సినిమా చేస్తున్నారు. సొంతగా బ్యానర్ ఏర్పాటు చేసుకున్న ఆయన ఈ సినిమా అందులోనే చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమ్నాలో తమిళ బుల్లితెర యాంకర్, నటి ప్రియాభవాని శంకర్ నటిస్తుందని అంటున్నారు. తమిళ ఛానళ్లలో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించి మంచి క్రేజ్ సంపాదించినా భవాని వెండితెరపైనా కాలుమోపి పలు తమిళ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ‘అహం బ్రహ్మాస్మి’ కథకు ఆమె అయితే సూట్ అవుతుందని అంటున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్‌తో దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’లో ఓ కీలక పాత్ర పోషిస్తుందీ భామ. ఇక ఈ సినిమాలో మంచు మనోజ్ అఘోరా పాత్ర పోషిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ విషయాల మీద అధికారిక సమాచారం అందాల్సి ఉంది.