English   

అభిరామ్ తో తన ఫస్ట్ నైట్ గురించి ఫేస్ బుక్ పోస్ట్ పెట్టిన శ్రీ రెడ్డి..

sri
2020-02-19 07:15:21

తెగించాలని ఫిక్స్ అయిపోయినప్పుడు అడ్డు అదుపు ఉండదు. శ్రీరెడ్డిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఒకసారి ఒకరిని టార్గెట్ చేయాలని ఫిక్స్ అయిపోయిన తర్వాత ముందు వెనక చూసుకునేది లేదు. కొన్ని రోజులు సైలెంట్ గా ఉంది కదా అని శ్రీ రెడ్డి మారిపోయింది అనుకుంటే అంతకంటే బుద్ధి తక్కువ పని మరొకటి లేదని మరోసారి నిరూపించింది ఈ భామ. కొన్ని రోజులుగా తనకేం సంబంధం లేదు అన్నట్టు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వంటలు చేసుకుంటుంది శ్రీ రెడ్డి. అది చూసి హమ్మయ్య ఈమె మారిపోయిందిరా బాబు అంటూ అభిమానులు కూడా సంతోష పడ్డారు. కానీ కాంట్రవర్సీలకు అలవాటు పడిన ప్రాణం కదా.. అంత ఈజీగా ఎలా మారిపోతుంది చెప్పండి. అందుకే మరోసారి తన బుద్ధి చూపించి అందరితో విమర్శల పాలవుతోంది శ్రీ రెడ్డి. తాజాగా రామానాయుడు స్టూడియోలో అభిరామ్ తో తాను చేసిన పనుల గురించి సోషల్ మీడియాలో మరోసారి పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి. ఈ స్టూడియోను డెవలప్మెంట్ కోసం మీనాక్షి కన్స్ట్రక్షన్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి సురేష్ బాబు అమ్మేశాడని ప్రచారం జరుగుతోంది. దాంతో అందరూ ఈ స్టూడియో తనకున్న అనుబంధం గురించి గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో మెసేజులు పెడుతున్నారు. ఈ సమయంలో శ్రీ రెడ్డి కూడా తనకు రామానాయుడు స్టూడియోతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.

కాకపోతే అందరిలా కాదు. ఈ స్టూడియోను పూర్తిగా కూల్చేసి ఓపెన్ ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారని తెలుస్తోంది. తనకు, సురేష్ బాబు చిన్న కొడుకు అభిరామ్ కు ఫస్ట్ నైట్ నానక్ రామ్ గూడా రామానాయుడు స్టూడియోలోనే జరిగిందని.. ఆ స్టూడియో అక్కడి నుంచి తీసేస్తున్నారు అని తెలిసి చాలా బాధగా ఉంది అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేసింది శ్రీ రెడ్డి. ఈ పోస్టు ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అప్పట్లో అభిరాం.. శ్రీరెడ్డితో చాలా రోజుల పాటు ఎఫైర్ నడిపించాడు. సాక్ష్యాలతో సహా తమ ఎఫైర్ గురించి మీడియా ముందు మాట్లాడింది శ్రీ రెడ్డి. తనను శారీరకంగా వాడుకున్నాడు కానీ అవకాశాలు మాత్రం ఇప్పించలేదు అంటూ అభిరామ్ తో పాటు ఇంకా చాలా మంది పేర్లను మీడియా ముందుకు తీసుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు మరోసారి అభిరామ్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది శ్రీ రెడ్డి.

More Related Stories