English   

వినాయక్ సినిమాకు ఊహించని షాక్.. మధ్యలోనే షూటింగ్ కు బ్రేక్..

vinayak
2020-02-19 07:52:14

దర్శకుడిగా వినాయక్ కు తిరుగులేదు. కొన్నేళ్ల పాటు పీక్స్ చూసాడు. ఆయన కోసం స్టార్ హీరోలు కూడా వేచి చూసారు. కానీ ఇప్పుడు ఆయన దర్శకుడిగా ఫెయిల్యూర్స్ లో ఉన్నాడు. సాయి ధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్లీ మెగాఫోన్ పట్టలేదు. కనీసం ఆయనకు అవకాశాలు కూడా ఎవరూ ఇవ్వడం లేదు. ఇలాంటి సమయంలో నటుడిగా మారిపోయాడు వినాయక్. దానికోసమే గెటప్ కూడా మార్చేసాడు. బాడీ బిల్డప్ చేసాడు. అన్నీ బాగానే ఉన్నాయి కానీ నటుడిగా ఈయన ఎంతవరకు సక్సెస్ అవుతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు మరో షాక్ కూడా ఈ దర్శకుడికి తగిలింది. ఈయన హీరోగా నటిస్తున్న సీనయ్య సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. సినిమా తెరకెక్కిన తీరు నిర్మాత దిల్ రాజుకు అసలు నచ్చకపోవడంతో ఈ సినిమాను పూర్తిగా ఆపేసారని ప్రచారం జరుగుతుంది. అసలు వినాయక్ హీరో అవుతాడని ఎవరూ అనుకోలేదు. ఉన్నట్లుండి యాక్టర్ అయిపోయాడు ఈయన.

ఇప్పుడు వినాయక్ గెటప్ చూస్తుంటేనే వారెవా అనిపిస్తుంది. అంతగా మేకోవర్ అయిపోయాడు. గతంలో ఠాగూర్ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు వినాయక్. అప్పుడే ఆయనలో మంచి ఈజ్ కనిపించింది. ఆ తర్వాత అదుర్స్, ఖైదీ నెం 150 లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ఇప్పుడు హీరో అవుతున్నాడు. కచ్చితంగా వినాయక్ స్క్రీన్ పై బాగుంటాడని తెలుసు.. కానీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తున్న సీనయ్య సినిమా షూటింగ్ పూర్తయిపోయింది. అయితే ఔట్ పుట్ సరిగ్గా రాకపోవడంతో మళ్లీ రీషూట్ చేయాలని దిల్ రాజు ఆర్డర్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు అది కూడా మానేసి పూర్తిగా సినిమాను ఆపేయాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలోనూ కొందరు దర్శకులు ఇలాగే నటులుగా మారి.. ఆ తర్వాత పూర్తిగా ఫేడవుట్ అయిపోయారు. మరి ఇప్పుడు వినాయక్ ఏం చేస్తాడో..? 

More Related Stories