English   

బోయపాటి - బాలయ్య సినిమాకి హీరోయిన్ ఫిక్స్

srinu
2020-02-19 08:08:59

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరిగా ఒక ఇనిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ముందు నుండి అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రలలో నటిస్తారని అంటున్నారు. ఒక పాత్ర అఘోరా పాత్ర అని అంటున్నారు, ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వారణాసిలో జరుగనుంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మరో వారంలో అంటే ఫిబ్రవరి 26 నుంచి జరగనుంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. ఈ హీరోయిన్స్ ఎవరు అనే దాని మీద రకరకాల చర్చలు జర్గుతుండగా తాజాగా శ్రియ పేరు లైన్ లోకి వచ్చింది. ఇందులో ఒక హీరోయిన్ పాత్ర కోసం శ్రియ ఓకే అయినట్టు సమాచారం. బాలకృష్ణ - శ్రియ ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించి క్రేజ్ కూడా క్రియేట్ చేశారు. ఈ ఇద్దరూ చివరిగా పైసా వసూల్ చేశారు. ఇప్పుడు మరలా బోయపాటి పుణ్యమా అని మళ్ళీ కలిసి నటించనున్నారు. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ ఎవరు అనే దాని మీద క్లారిటీ లేదు. బహుశా ఈ సినిమా షూట్ కి వెళ్ళే లోపు ఆ విషయాల మీద క్లారిటీ రావచ్చు.  

 

More Related Stories