English   

విరాటపర్వం నుండి ఆసక్తికర అప్డేట్

Viraata Parvam
2020-02-19 10:49:52

నీది నాదీ ఒకే కధ ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి లీడ్ రోల్స్ లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా సాయి పల్లవి నక్సలైట్ గా నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో తన పాత్రలో ఈజ్ కోసం రానా రిటైర్డ్‌ పోలీస్‌ ఉన్నతాధికారి దగ్గర ప్రత్యేకంగా శిక్షణ తీసుకునున్నాడని కూడా ప్రచారం జరిగింది. 

సాయి పల్లవి పాత్ర ఏమో జానపద గీతాలు పాడుతూ ప్రజలను చైతన్య పరిచే యువతిగా ఉంటుందట. భువనగిరిలో అత్యంత దారుణ హత్య కు గురైన బెల్లి లలిత పాత్ర ని పోలి వుంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ట‌బుని మాన‌వ హ‌క్కుల కోసం పోరాడే జర్నలిస్ట్ పాత్ర కోసం తీసుకోవాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించినా `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమా కోసం ఈ సినిమాని వదులుకుంది. అయితే ఆమె స్థానంలో బాలీవుడ్ న‌టి నందితాదాస్‌ ని అప్పుడే తీసుకున్నారు. 

ఆమె పాత్రకు సంబందించిన తాజాగా షూటింగ్ నిన్న మొద‌లైంది. ఈ సినిమాని స‌మ్మ‌ర్‌ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విరాట పర్వం సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. సురేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా వ్యవ‌హ‌రిస్తున్న ఈ చిత్రాన్ని సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి వన్ నేనొక్కడినే, సాహో, ఉరిలాంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన డాని షాంచెజ్‌ లోఫెజ్‌ కెమెరామేన్‌గా పనిచేస్తున్నాడు.  

More Related Stories