English   

వెంకీమామతో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్న చరణ్ 

 Ram Charan
2020-02-19 11:05:32

తెలుగులో అందరి హీరోల అభిమానులు అభిమానించే హీరో వెంకటేష్. ఈయనకి అజాత శత్రువు అనే పేరుంది. కెరీర్ మొదటి నుండి ఈయన మల్టీస్టారర్ లు చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. మొన్నటికి మొన్న మేనల్లుడు నాగచైతన్యతో వెంకీ మామ సినిమా చేసి హిట్ కొట్టాడు. అయితే ఈయన మెగా హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్టు ప్రచారం జరుగుతోంది. 

అదేంటంటే రామ్ చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ పపెట్టి చిరంజీవి హీరోగా రెండు సినిమాలు కూడా నిర్మించాడు. తాజాగా రెండు మలయాళ చిత్రాల రీమేక్‌ హక్కులు కూడా కొన్నాడు. ‘లూసిఫర్‌’, ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ సినిమాలను తెలుగులో రీమేక్ చేయాలని యోచన, ఈ రెండు సినిమాల్లో రెండు కీలక పాత్రల్లో చెర్రీ నటించనున్నాడని అంటున్నారు.

అయితే లూసిఫార్ సినిమా కోసం చిరంజీవి ఫైనల్ కాగా ‘డ్రైవింగ్‌ లైసెన్స్‌’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించేందుకు చెర్రీ వెంకటేష్‌ను సంప్రదించాడని అంటున్నారు. అయితే కొణిదెల బ్యానర్ కేవలం తన తండ్రి కోసం మాత్రమే అని రామ్ చరణ్ ఇంతకముందు చెప్పి ఉన్నాడు. మరి ఇప్పుడు మనసు మార్చుకుని వేరే హీరోని ఎంటర్ చేస్తున్నాడా ? అనేది తేలాల్సి ఉంది. వెంకటేష్ ప్రస్తుతం అసురన్ రీమేక్ లో బిజీగా ఉండగా రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ లో బిజీగా ఉన్నాడు.  

More Related Stories