English   

ఏకంగా సల్మాన్ నే పట్టిన మైత్రీ మూవీ మేకర్స్ ..

Mythri Movie Makers
2020-02-20 10:28:44

అసలు ఏమాత్రం సినిమాలకి సంబంధం లేని రంగాల నుండి వచ్చిన వారు మైత్రీ మూవీ మేకర్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ముహూర్తబలమో లేక కాంబినేషన్ ల బలమో కానీ నిర్మాణ రంగంలోకి వచ్చిన అతి తక్కవ కాలంలో మంచి పేరును సంపాదించుకుంది మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ. తీసిన సినిమాలన్నీ దాదాపుగా హిట్ అయ్యేవి అయితే గత ఏడాది కొన్ని సినిమాలు దేబ్బెసినా ఆ తర్వాత వచ్చిన సినిమాలు హిట్ అయ్యాయి. ఒకరకంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ నలుగురు ప్రొడ్యూసర్స్ తో పాటు ఈ బ్యానర్ కూడా టాప్ లో నిలుస్తోంది.

 ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ తో పాటు చాలా సినిమాలు క్యూలో ఉన్నాయి. అయితే మైత్రి మార్క్ ని ఇంకాస్త పెంచాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అదేంటంటే ఈ బ్యానర్ బాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. మొదటి సినిమానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో తెరకెక్కించాలని మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సల్మాన్ కు సన్నిహితుడు, నిర్మాత అయిన అతుల్ అగ్నిహోత్రితో మైత్రీ టీమ్ చర్చలు కూడా జరిపారని అంటున్నారు. దీని మీద అధికారిక సమాచారం అందాల్సి ఉంది.

More Related Stories