English   

విజయ నిర్మల జయంతి .. విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మహేష్

Mahesh Babu
2020-02-20 11:42:21

అలనాటి అందాల తార, దర్శకురాలు విజయ నిర్మల జయంతి ఈరోజు. ఎందరో అభిమానుల్లో చిరకాలం నిలిచిపోయే పాత్రల్లో నటించడమే కాక ఎక్కువ సినిమాలు తెరకెక్కించిన దర్శకురాలిగా చెరగని ముద్ర వేసుకున్నారామె. ‘నీరజ’గా తెలుగు చలనచిత్ర రంగప్రవేశం చేసి విజయనిర్మలగా మారి ఏకంగా 42 సినిమాలకు దర్శకత్వం వహించి అప్పటిదాకా 27 చిత్రాల రికార్డు కలిగిన ఇటలీ దర్శకురాలి పేరు చెరిపేసి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పారు.  

నేడు ఆమె తొలి జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించబోతోంది. నానక్‌రామ్‌గూడలోని విజయనిర్మాల నివాసంలో విజయ నిర్మల విగ్రహాన్ని ఏర్పాటుచేయనున్నారు. ఈ విగ్రహాన్ని సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించనున్నారని అంటున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎంపీ సంతోష్, ఇతర సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్‌‌లో వచ్చిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచాయి. ‘సాక్షి’ చిత్రంతో మొదలైన వీరి సినీ ప్రయాణం వివాహానికి కారణమైంది. సుమారు 47 చిత్రాల్లో కలిసి నటించిన వీరిద్దరూ ఆదర్శ దంపతులగా నిలిచారు.

More Related Stories