English   

ఢిల్లీకి పవన్...రాజకీయంగా ప్రాముఖ్యత 

 pawan kalyan
2020-02-20 11:45:24

ఒక పక్క సినిమాలు చేస్తూ... మరోవైపు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఈ టూర్‌ కి రాజకీయ ప్రాధాన్యత లేకున్నా చర్చనీయాంశంగా మారింది. ఇక నేడు ఆయన రెండు  కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. పవన్ గతంలోనే సైనిక అమర వీరుల కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్‌ను ఇచ్చేందుకు నేడు ఆయన సైనికాధికారుల్ని కలవనున్నారు. దానికోసం ఇందుకోసం కేంద్రీయ సైనిక బోర్డు కార్యాలయానికి వెళ్లి చెక్ అంస్తారు.

అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు పవన్ కళ్యాణ్... విజ్ఞాన భవన్‌లో ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు పవన్ ను ప్రశ్నలు అడుగుతారు.  దేశానికి బలమైన, అవినీతికి పాల్పడని యువ రాజకీయ నాయకుల అవసరాన్ని ఉద్దేశించి నిర్వహిస్తున్న ఈ సదస్సులో పవన్ కళ్యాణ్‌పై ప్రత్యేకంగా రూపొందించిన ఒక షార్ట్ ఫిలిం ప్రదర్శిస్తారని కూడా అంటున్నారు. అయితే వైసీపీ-బీజేపీ పొట్టు అంశం తెరమీదకు వచ్చిన అనంతరం పవన్ ఢిల్లీ వెళ్తుండడంతో ఈ పర్యటన రాజకీయంగా ప్రాముఖ్యత సంతరించుకుంది.  

More Related Stories