విజయ్ దేవరకొండ సినిమాలో అనన్య పాండేనే

విజయ్ దేవరకొండ హీరోగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ స్పోర్ట్స్ డ్రామాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. లవర్స్ డే సందర్భంగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ పూరీ సినిమా షూటింగ్ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాపై సెట్స్‌పైకి వెళ్లినా హీరోయిన్, ఇతర క్యాస్ట్ విషయంలో యూనిట్ ఎలాంటి క్లారిటీని ఇవ్వలేదు.
తాజాగా ఈ సినిమాలో విజయ్ సరసన ఆడిపాడేదే ఎవరో పూరి బృందం అధికారికంగా ప్రకటించింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హిందీ తెరకు పరిచయమైన అనన్య పాండేను ‘లైగర్’ హీరోయిన్ గా నటిస్తున్నట్లు ప్రకటించింది. తొలుత జాన్వి కపూర్ ఈ సినిమాలో నటించనున్నట్టు ప్రచారం జరిగినా చివరికి అనన్య పాండేను ఫైనల్ చేశారు. కరణ్ జోహార్ ఈ చిత్ర నిర్మాణ భాగస్వామిగా ఉండడంతో ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీ. వేసవి చివరలో తెరపైకి వచ్చే అవకాశముంది.