English   

రష్మీ, ప్రదీప్ పెళ్ళంట.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త..

 pradeep marriage
2020-02-20 17:49:08

రష్మి గౌతమ్.. ఈ పేరు వినగానే వెంటనే సుడిగాలి సుధీర్ పేరు కూడా పక్కనే వినిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇద్దరి పేర్లు పక్కపక్కన ఉంటే ఆ వైబ్రేషన్ తెలుస్తుంది. ఇద్దరు చాలా రోజులుగా ప్రేమించుకుంటున్నారని.. వీలైనంత త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఇదంతా కేవలం మేము టీవీలో స్క్రిప్ట్ ప్రకారం మాత్రమే చేస్తున్నామని.. దయచేసి అర్థం చేసుకోవాలి అంటూ సుధీర్, రష్మీ ప్రేక్షకులను కోరుతున్నారు. 

అయితే ఎవరు ఎన్ని చెప్పినా కూడా వీళ్ళ మధ్య కెమిస్ట్రీ చూసినప్పుడు లేనిపోని అనుమానాలు కచ్చితంగా వస్తుంటాయి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త కూడా వైరల్ అవుతుంది. అదేంటంటే యాంకర్ ప్రదీప్, రష్మీ పెళ్ళి చేసుకోబోతున్నారని. వినడానికి నిజంగా చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అయితే ఇద్దరు గత కొన్నేళ్లుగా ఢీ షోలో పనిచేస్తున్నారు. అందులోనే సుడిగాలి సుదీర్ కూడా ఉంటాడు. కావాలని సుదీర్ ను ప్రదీప్ ఓ రేంజ్ లో ఆడుకుంటాడు ఢీలో. ఇక ఈ షో లో అప్పుడప్పుడు యాంకర్ రష్మి గౌతమ్ తో కూడా ప్రదీప్ బాగానే రొమాన్స్ చేస్తుంటాడు. సుదీర్ ని ఉడికించడానికి ఈ ఇద్దరూ కలిసి పోతారు. 

ఇక ఈ జంట చూడటానికి కూడా చక్కగా ఉంటుందని.. అందుకే వీళ్ళ మధ్య ప్రేమ కూడా పుట్టింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. గత కొన్ని రోజులుగా ప్రదీప్ రష్మీల పెళ్ళి గురించి హాట్ టాపిక్ అవుతూ వైరల్ అవుతోంది. అంతేకాదు ఇద్దరూ సమ్మర్ లో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. బయటికి తెలియకుండా చాలా సైలెంట్ గా జరుగుతుందని మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకూ నిజముందో గాని దీనిపై ప్రదీప్ లేదా రష్మీ స్పందిస్తే జనాలకి ఒక క్లారిటీ వస్తుంది. ఏదేమైనా కూడా సుధీర్, రష్మీ మధ్య వార్తలు రావడం కామన్. కానీ రష్మీ, ప్రదీప్ మధ్య ఇలాంటి వార్త రావడం మాత్రం నిజంగానే సంచలనం. 

More Related Stories