English   

విజయ్ దేవరకొండకు మరో షాక్.. ఆగిపోయిన ఆ సినిమా..

Vijay Devarakonda
2020-02-20 18:28:48

విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం ఎటు వెళ్తుందో తెలియని డైలమాలో పడిపోయింది. ఈ మధ్య విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా అంచనాలను అందుకోవటంలో దారుణంగా విఫలమైంది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. దానికి తోడు విజయ్ దేవరకొండ మార్కెట్ కూడా ఒకేసారి పడిపోయింది. అందుకే విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలపై ఆసక్తి కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈయన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. విజయ్ వరుస పరాజయాలు ఆయన ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ పై ప్రభావం చూపిస్తున్నాయి. 

అర్జున్ రెడ్డి సినిమా విడుదలైన తర్వాత విజయ్ దేవరకొండ చాలా సినిమాలు ఒప్పుకున్నాడు. అయితే అప్పుడు ఎలాంటి ఇమేజ్ లేని విజయ్ ఆ కథలు విని ఓకే అన్నాడు. కానీ అవే తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్ గా విడుదలై డిజాస్టర్ అయ్యాయి. అదే సమయంలో హీరో అని మరో సినిమాకు కూడా కమిట్ అయ్యాడు ఈయన. ఒక కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమా బడ్జెట్ ఎక్కువైపోయి మధ్యలోనే ఆపేశారని ప్రచారం జరిగింది. కానీ నిర్మాతలు మాత్రం ప్రాజెక్ట్ ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చారు. అప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే తిరిగి ప్రారంభమవుతుందని ప్రకటించారు. 

కానీ ఇప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ డిజాస్టర్ కావడంతో ఈ సినిమాను నిర్మాతలు పూర్తిగా పక్కన పెట్టేశారని ప్రచారం జరుగుతోంది. విజయ్ మార్కెట్ భారీగా తగ్గటంతో హీరో లాంటి భారీ బడ్జెట్ సినిమా వర్కవుట్ కాదని వాళ్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే మీడియం బడ్జెట్‌లో మరో దర్శకుడితో సినిమా చేస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. ఇప్పటికే మారుతి, సుజీత్ లాంటి దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా కూడా వరుస సినిమాలు పోతుండటంతో విజయ్ దేవరకొండ కూడా కన్ఫ్యూజన్ లో పడిపోయాడు.

More Related Stories