అనుపమ పరమేశ్వరన్ చూపుల యార్కర్ కు స్టార్ క్రికెటర్ బౌల్డ్..

క్రికెట్, సినిమా రెండూ రెండే. ఇక్కడా అక్కడా ఎప్పుడూ ప్రేమలు ఉంటాయి. అవినాభావ సంబంధాలు కూడా ఉంటాయి. క్రికెటర్స్ సినిమా వాళ్లను పెళ్లి చేసుకోవడం కూడా ఇప్పట్నుంచి వస్తున్న ట్రెండ్ కాదు. ఎప్పట్నుంచో నడుస్తున్న ట్రెండ్ అది. మొన్నటికి మొన్న విరాట్ కోహ్లీ కూడా అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో జంట కూడా ఇలాగే ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. వాళ్లే అనుపమ పరమేశ్వరన్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. టీమిండియా యార్కర్స్ స్పెషలిస్ట్ బుమ్రా.. అనుపమ చూపులకు బౌల్డ్ అయ్యాడని ప్రచారం జరుగుతుంది.
నిప్పులు చెరిగే బంతులతో బ్యాట్స్ మెన్ వికెట్స్ తీసే ఈయన ఇప్పుడు అనుపమ కంటి చూపుకు పడిపోయాడని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనుపమ మాత్రం తనకు బుమ్రా మంచి స్నేహితుడు మాత్రమే అని క్లారిటీ ఇచ్చింది. తనతో జస్ట్ పరిచయం ఉంది కానీ తమ మధ్య ఏం లేదని చెబుతుంది ఈ బ్యూటీ. ఇక ఈ విషయంలో కనీసం క్లారిటీ ఇవ్వడానికి కూడా బుమ్రా ఖాళీగా లేడు. ఈయన ప్రస్తుతం టీమ్ ఇండియా షెడ్యూల్ తో బిజీ. అయితే ఎంత కాదని చెబుతున్న సోషల్ మీడియాలో వీళ్ళు చేసే పనులు మాత్రం అలాగే ఉన్నాయి.
ఈ మధ్య తన 24వ పుట్టినరోజును జరుపుకుంది అనుపమ పరమేశ్వరన్. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ట్విట్టర్ లో 24 అంటూ రాసుకొచ్చింది అనుపమ. ఇక్కడ వరకు అంత బాగుంది.. కానీ ఇక్కడే బుమ్రా చేసిన పనితో మరోసారి వీరిద్దరి మధ్య ప్రేమ గురించి వార్తలు తెరపైకి వచ్చాయి. అనుపమ ఫోటోలు షేర్ చేస్తూ డోంట్ గ్రో అప్.. ఇట్స్ ఏ ట్రాప్ అంటూ ట్వీట్ చేశాడు ఈ స్టార్ క్రికెటర్. దాంతో కచ్చితంగా వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందని ఇప్పుడు నెటిజన్లు ముచ్చటించుకుంటున్నారు