English   

ఆ డైరెక్టర్ కూతురు పోర్న్ ఇండస్ట్రీకి...వర్మ మద్దతు

Ram Gopal Varma
2020-02-21 11:23:23

కొన్ని కొన్ని విషయాలలో మనదేశానికి అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకి చాలా తేడాలు ఉంటాయి. మనదగ్గర ఇంట్లో పిల్లలు పోర్న్ చూస్తున్నారని తెలిస్తేనే వెంటనే తోలు తీసి మరీ లైన్ లో పెడతారు. అలాంటిది తన కుమార్తె ఏకంగా పోర్న్ ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నా అని చెప్తే ఏ తండ్రి అయినా ఏం చేస్తాడు, మనదగ్గర అయితే కాళ్ళు విరగ కొడతారు. కానీ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ మాత్రం తన కుమార్తె ఆలోచనను,తీసుకున్న నిర్ణయాన్ని సమర్దించారు. 

ఆమె సొంతంగా సెక్స్ వర్కర్ గా మారి,వీడియోలు నిర్మిస్తానంటే నీ ఇష్టం అని పర్మిషన్ ఇచ్చాడు.  మైకెల్ స్పీల్ బర్గ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ కు ఏడవ సంతానం. ఆమె వయస్సు 23, రీసెంట్ గా సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తాను సోలోగా అడల్ట్ వీడియోలు నిర్మిచబోతున్నట్లు ప్రకటించింది. అంతేకాదు తన తండ్రి తన నిర్ణయానికి మద్దతిచ్చారని చెప్పుకొచ్చింది. 

ఈ విషయం మీద రాంగోపాల్ వర్మ స్పందించారు. ఆమె తీసుకున్న నిర్ణయం, దీనిపై ఆమె తల్లిదండ్రుల స్పందన పట్ల దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మ ట్వీట్ చేసాడు. 'అమెరిక‌న్ డైరెక్ట‌ర్ స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్ కూతురు పోర్న్ కెరీర్‌ని ఎంచుకుంది. దీనికి ఆయన మద్దతు తెలిపారు. మికేలా నిర్ణ‌యాన్ని స్పీల్‌బ‌ర్గ్ ఎంత‌గానో స‌మ‌ర్థించారు. ప్ర‌పంచం క్రమంగా అభివృద్ధి చెందుతోంది' అని పేర్కొన్నారు. ఇక తాను ఈ వృత్తిని ఎంచుకున్నందుకు తాను సిగ్గుపడటం స్పీల్ బర్గ్ కూతురు చెప్పుకొచ్చింది. తన కాబోయే భర్త చక్ పాంకో కూడా ఒప్పుకున్నారని, అయితే తన భర్తపై ఉన్న గౌరవంతో సోలో వీడియోస్ మాత్రమే చేస్తాననని ఆమె స్పష్టం చేసింది.

More Related Stories