English   

త్రివిక్రమ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన రష్మిక..దారుణంగా 

Rashmika Mandanna
2020-02-21 12:17:56

తెలుగులో ప్రస్తుతం ఒక రేంజ్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అయినా ఏదో వెలితి, ఎందుకంటే సక్సెస్ఫుల్ సినిమాల్లో కనిపిస్తోంది కానీ ఆమెకు తగిన ప్రాధాన్యత ఉండడం లేదు. సో సినిమాలో ఉంటే ప్రాధాన్యత అయినా ఉండాలి లేకుంటే అందుకు తగ్గ రేమ్యునరేషన్ అయినా ఉండాలి. కానీ ఆమె ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించేందుకు ఏకంగా త్రివిక్రమ్ కి భారీ ఆఫర్ లు ఇచ్చేసిందని ప్రచారం జరుగుతింది. 

అదెందుకు అంటే త్రివిక్రమ్  సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఏదో తెలియని ఆసక్తి ఉంటుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువగా స్టార్స్ తోనే సినిమాలు తీసిన త్రివిక్రమ్ వాళ్ళతో రిపీటెడ్ గా సినిమాలను తీయడం ఎక్కువ. ఆయన సినిమాలలో హీరోయిన్స్ ఎక్కు వగా రిపీట్ చేస్తుంటారు. కనీసం ఒక్కో హీరోయిన్ కనీసం రెండు సినిమాలు చేస్తుంది. సమంత, ఇలియానా, పూజా హెగ్డేలు అదే కోవకు చెందుతారు. 

అందుకే ఇప్పుడు రష్మిక త్రివిక్రమ్ ఎన్.టి.ఆర్ తో తెరకెక్కించబోయో తాజా చిత్రంలో ఛాన్స్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తుందని, ఎన్.టి.ఆర్ ల తాజా చిత్రం లో ఛాన్స్ ఇస్తే రెమ్యూనరేషన్ ఎంతిచ్చినా పర్లేదని అసలు ఇవ్వకపోయినా సినిమా చేస్తానని ఆఫర్ ఇచ్చిందని అంటున్నారు. అంతే కాక గ్లామరస్ గా కనిపించడానికైనా, లిప్ లాక్స్ అయినా ఒకే అని చెప్పిందని అంటున్నారు. అయితే ఈ వార్త నిజమో కాదోగాని ఈ న్యూస్ మాత్రం వైరల్ అవుతోంది. ఆఫర్ కోసం ఇంత తెగిస్తావా అంటూ ఆమె మీద ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. 

More Related Stories