English   

అభిమానులను మోసం చేసిన కియారా అద్వానీ..

kaira
2020-02-22 06:59:44

గత మూడు రోజులుగా డబూ రత్నాని క్యాలెండర్లో ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఎంతమంది ఫోజు ఇచ్చిన కూడా ముఖ్యంగా కియారా అద్వానీ చేసిన న్యూడ్ ఫోటో షూట్ మాత్రం సంచలనం సృష్టించింది. ఈ ఫోటోలు కుర్రాళ్లను నిద్ర పట్టకుండా చేశాయి. ఒక అరటి ఆకు అడ్డం పెట్టుకుని నగ్నంగా కెమెరా ముందు ఫోజులు ఇచ్చింది కియారా అద్వానీ. ఈ ఫోటోలు చూసిన తర్వాత వామ్మో అంటూ ముక్కున వేలేసుకున్నారు. కానీ ఈ న్యూడిటీ వెనకాల ఉన్న ఒరిజినాలిటీ ఇప్పుడు బయటకు వచ్చింది. ఒక్కోసారి మన కళ్ళతో చూసింది కూడా నిజం కాదు.. అంటే ఏమో అనుకుంటాం కానీ ఇప్పుడు ఫోటో షూట్ వెనకాల ఉన్న నిజాలు తెలిస్తే ఇది నమ్మక తప్పదు. అది చూసిన తర్వాత అభిమానులు కూడా మండి పడుతున్నారు.

మమ్మల్ని ఇంతగా మోసం చేస్తావా అంటూ ఆమెను నిలదీస్తున్నారు. ఇంతకీ విషయం ఏంటంటే అక్కడ కియారా అద్వానీ నగ్నంగా కనిపించింది అనుకోవడం మన భ్రమ.. అది పూర్తిగా ఒక అబద్ధం.. అందమైన అబద్ధం. నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. నిజానికి గ్రాఫిక్స్ లో ఆమె అందాన్ని అలా చూపించారు.. అంతేగాని నిజంగా ఆమె అక్కడ నగ్నంగా ఫోజులు ఇవ్వలేదు ఈ విషయం తెలిసిన తరువాత అభిమానులు ఒక్కసారిగా అయ్యో అనుకున్నారు. ఈమధ్య విడుదలైన జాను సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఒక్కోసారి జీవితంలో ఏమీ జరక్కపోయినా ఏదో జరుగుతుంది అనిపిస్తుంది అని.. ఇప్పుడు కియారా అద్వానీ ఫోటోలు చూసిన తర్వాత కూడా ఇదే అనిపిస్తుంది. అక్కడ న్యూడిటీ లేకపోయినా కూడా మనకు ఉన్నట్లు తన కెమెరా వర్క్ తో మాయ చేశాడు డబూ రత్నాని. అది నిజమా అబద్దమా అనేది పక్కన పెడితే కియారా ఫోటోషూట్ మాత్రం 2020 కి ఒక సంచలనం.

More Related Stories