మహేష్ బాబు దర్శకుడితో రామ్ చరణ్ నెక్ట్స్ సినిమా..

రామ్ చరణ్ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నాడు. ఓ వైపు రాజమౌళి RRR సినిమాలో నటిస్తూనే మరోవైపు తండ్రి చిరంజీవి సినిమాను కూడా నిర్మిస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై నిర్మిస్తున్నాడు చరణ్. ఈ సమయంలో ఈయన తర్వాతి సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. మరో మూడు నెలల్లో రాజమౌళి సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఆ తర్వాత చరణ్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనేది అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్న ప్రశ్న.
దీనికి సమాధానంగా ముగ్గురు దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. సాహో లాంటి భారీ సినిమా చేసిన సుజీత్.. వరస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి.. జెర్సీ లాంటి ఎమోషనల్ సినిమా చేసిన గౌతమ్ తిన్ననూరి. ఈ ముగ్గురు దర్శకుల్లో ఎవరో ఒకరితో చరణ్ నెక్ట్స్ సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే సుజీత్ ఇప్పటికే ఔట్ ఆఫ్ ది రేస్ అని తెలుస్తుంది. ఈయన చెప్పిన కథ చరణ్ కు పెద్దగా కిక్ ఇవ్వలేదని చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.
మరోవైపు గౌతమ్ కథ నచ్చినా కూడా ఆయన హిందీ జెర్సీ రీమేక్ తో బిజీగా ఉన్నాడు. దాంతో ఆయనతో ఇప్పట్లో సినిమా కుదరనట్లే. ఇక ఈ మధ్యే చరణ్ ను అనిల్ రావిపూడి కలిసి అదిరిపోయే లైన్ చెప్పాడని తెలుస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఉండే ఈ కథకు చరణ్ కూడా ఫిదా అయినట్లు ప్రచారం జరుగుతుంది. అన్నీ కుదిర్తే ఈయనతోనే రామ్ చరణ్ సినిమా ఉంటుందంటుంది మెగా కంపౌండ్. ఈ మధ్యే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మహేష్ బాబుకు పెద్ద హిట్ ఇచ్చాడు ఈ దర్శకుడు. పైగా ఎఫ్3 కూడా కాస్త ఆలస్యమయ్యేలా కనిపిస్తుంది. అందుకే చరణ్ సినిమాపై ఫోకస్ చేయబోతున్నాడు ఈ దర్శకుడు.