English   

రామ్ చరణ్ లుంగీ లుక్... సండే రోజు కుక్కతో ఆడుకుంటూ...

Ramcharan Pet.jpg
2020-02-24 05:29:37

RRR సినిమాతో కొన్ని రోజులుగా బ్రేక్ లేని షూటింగ్స్ చేస్తున్నాడు రామ్ చరణ్. సండే మాత్రమే ఖాళీగా ఉంటున్నాడు ఈయన. ఈ చిత్ర షూటింగ్ కూడా హైదరాబాద్ లోనే జరుగుతుండటంతో హాయిగా కుటుంబంతో పాటే ఎంజాయ్ చేస్తున్నాడు చరణ్. ముఖ్యంగా సెలవు రోజుల్లో తన కుక్కతో టైమ్ పాస్ చేస్తున్నాడు చరణ్. ఈ కుక్క పిల్లను భార్య ఉపాసన గిఫ్టుగా ఇచ్చింది. దాంతో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు దాంతో ఆడేసుకుంటున్నాడు మెగా వారసుడు. ఇప్పుడు కూడా ఈయన ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో దాంతోనే ఆడుకుంటున్నాడు. పైగా రామ్ చరణ్ లుంగీలో ఉన్న లుక్ వైరల్ అవుతుంది. హాయిగా ఇంట్లో ఉన్నపుడు ప్యాంట్స్, షార్టులు అని కాకుండా లుంగీ కట్టుకుని కూర్చున్నాడు చరణ్. సాధారణంగా సెలబ్రిటీస్ అంటే అలాంటి పనులు చేయరేమో.. లుంగీ అంటే కూడా తెలియదేమో అనుకుంటారు కానీ తనకు మాత్రం లుంగీలో ఉన్న కంఫర్ట్ మరెందులో ఉండదంటున్నాడు చరణ్. అది కట్టుకుని హాయిగా తన పెట్ తో ఆడుకుంటున్నాడు. భార్య ఉపాసనే తన భర్తను సోషల్ మీడియాలో ఎప్పుడూ ప్రమోట్ చేస్తూ ఉంటుంది. తనకు ఫస్ట్ పిఆర్ కూడా ఉపాసనే. అందుకే ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత సోషల్ మీడియా ఫాలోయింగ్ కూడా భారీగానే పెరిగిపోయింది చరణ్ కు. ప్రస్తుతం RRR సినిమాతో పాటే తండ్రి చిరంజీవి సినిమాను కూడా నిర్మిస్తున్నాడు.

More Related Stories